45
సాక్షి మీడియాపై పరువునష్టం దావా కేసుకు సంబంధించి మంత్రి నారా లోకేశ్ ఇవాళ విశాఖ కోర్టులో హాజరయ్యారు. కోర్టు విచారణ అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. పరువునష్టం కేసు గెలుస్తామని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఇంత జరిగినా బ్లూ మీడియాలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. సాక్షి మీడియాపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తనపై ఒక్క ఆరోపణను కూడా సాక్షి మీడియా నిరూపించలేకపోయిందని అన్నారు. తాను ఎక్కడా ప్రజాధనాన్ని వృథా చేయలేదని, ఇకనైనా సాక్షి వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలని లోకేశ్ హితవు పలికారు. తప్పుడు ప్రచారం చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని సాక్షి యజమానిని హెచ్చరిస్తున్నా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.