ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 మెగా క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనే క్రీడాకారులకు అందచేసే టీ షర్ట్స్ ను ఉపకార్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు విడుదల చేశారు. ఆరిలోవ లోని ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి జరిగే టోర్నమెంట్ లో 24 ఫ్రాంచైజీలు నుంచి 450మంది ప్లేయర్ల పాల్గొంటున్నారని పేర్కొన్నారు. పినాకల్ మైదానంలో మ్యాచ్ లు జరుగుతాయిని ప్రతి మ్యాచ్ కు లైవ్ ఉంటుందని చెప్పారు. ప్రముఖ సినీ నటులు ఉపేంద్ర బాబు పుట్టినరోజు సందర్బంగా ఈ నెల 29న టోర్నమెంట్ లో విజేత జట్టు కు లక్షా 20వేల రూపాయలు, రన్నర్ జట్టు కు 60వేల రూపాయలు, తృతీయ జట్టు కు 30వేలు రూపాయలు ప్రైజ్ మనీ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. యువత చెడు దారిన పట్టకుండా పెద్ద ఎత్తున స్పోర్ట్స్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నవంబర్ లో రాష్ట్ర స్థాయి వాలిబాలీ పోటీలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు క్రీడలు వలన మనస్సు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. డాక్టర్స్, జర్నలిస్టుల, అధికారులు తదితర ఆరు జట్లు తో ఫ్రెండ్లీ మ్యాచ్ కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పినాకల్ మైదానంను క్రికెట్ స్టేడియంగా తీర్చి దిద్ధి యువత కు అంకితం చేయాలని ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మేనేజర్ సుధీర్, 24 ఫ్రాంచైజీల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు
ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 మెగా క్రికెట్ టోర్నమెంట్
47