తెలంగాణ నేపథ్యంలో సాగే *పొట్టేల్* చిత్రం ఈనెల 25న విడుదల కానుందని ప్రేక్షకులు విజయవంతం చేయాలని చిత్ర *హీరోయిన్ అనన్య నాగళ్ళ* కోరారు. పొట్టేల్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ బస్సు యాత్ర నిర్వహించింది. విశాఖ కు బుధవారం చేరుకున్న యూనిట్ సభ్యులు సాయంత్రం బీచ్ రోడ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ అనన్య నాగళ్ళ మాట్లాడుతూ పొట్టేలు చిత్రం
ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆశ భావం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తాను చేసిన చిత్రాల కంటే భిన్నంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. ఈ చిత్రానికి పొట్టేల్ అనే పేరు పెట్టడం వెనక ఎంతో ఆసక్తికరమైన కధనం ఉంటుందన్నారు. *హీరో యువన్ కృష్ణ* మాట్లాడుతూ ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు, పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది అన్నారు.. ఈ చిత్రంలో సీనియర్ నటుడు అజయ్ పాత్ర ప్రేక్షకులను కట్టిపడేస్తుంది అన్నారు .
*నటుడు నోయల్* మాట్లాడుతూ ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు అమితంగా నచ్చుతుందని తెలిపారు. దర్శకుడు సాహిత్ మొతుకూరి అద్భుతం గా తీశారు అన్నారు. *చిత్ర సహనిర్మాత నిశాంక్ రెడ్డి* మాట్లాడుతూ అనేకమంది సీనియర్ నటులు నటిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈనెల 25న థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుందని, ప్రేక్షకులు తప్పక విజయవంతం చేయాలని కోరారు.
తెలంగాణ నేపథ్యంలో సాగే *పొట్టేల్* చిత్రం ఈనెల 25న విడుదల #vvwnews
49