*మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీ*
నాచారం లోని తెలంగాణ ఫుడ్స్ కార్యాలయాన్ని, కర్మాగారం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
అంగన్వాడి కేంద్రాలకు బాలామృతంతో సహా పలు రకాల ఆహార వస్తువులను సరఫరా చేస్తున్న టీజీ ఫుడ్స్
ఆహార పదార్థాల నాణ్యతను, పరిసరాల పరిశుభ్రతను చెక్ చేసిన మంత్రి సీతక్క
టీజీ ఫుడ్స్ ఫ్యాక్టరీ లో కలియ తిరుగుతూ, కార్మికులు సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్న మంత్రి గారు
*మంత్రి సీతక్క ఆకస్మిక తనికి తో అధికారులు సిబ్బంది అప్రమత్తం*
టీజీ ఫుడ్స్ విభాగాలను, యంత్రాల పనితీరును మంత్రికి వివరిస్తున్న అధికారులు, సిబ్బంది
ముడి సరుకుల నుంచి ప్యాకేజింగ్ వరకు మరింత శుభ్రత పాటించేలని ఆదేశించిన మంత్రి సీతక్క
అంగన్వాడీలకు ఇక్కడి నుంచి ఫుడ్ సప్లై అవుతున్నదున చిన్నారుల భవిష్యత్తు దృష్టిలో శుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన మంత్రి సీతక్క
శుద్ధిచేసిన ఆహార పదార్థాలను తక్షణం కవర్ చేసేలా ఏర్పాటు చేయాలని ఆదేశాలు
ఆహార పదార్థాలు, స్టోరేజ్ పాత్రలపై మేష్ లు బిగించాలని ఆదేశాలు
నిర్మాణంలో ఉన్న కొత్త యూనిట్లను సందర్శిస్తున్న మంత్రి సీతక్క
కొత్త యూనిట్ పనులు పదేళ్లుగా పూర్తికాకపోవడమ్ పట్ల మంత్రి సీతక్క ఆశ్చర్యం
యంత్రాలను త్వరగా ఇన్స్టాల్ చేయాలని అదేశాలు
సాంకేతిక లోపంతో నెల రోజులుగా పని చేయని స్నాక్ ఫుడ్ యూనిట్
మరమ్మతులు చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అధికారులు సిబ్బందిపై మంత్రి ఆగ్రహం
బడ్జెట్ వివరాలు, ఖర్చులు వ్యయాలు, ఇబ్బందులు సమస్యలు, ఉన్నత స్థాయి సిబ్బంది అర్హత, అనుభవం, ఎంతకాలంగా టీజీ ఫుడ్స్ లో ఏ స్థాయిలో పనిచేస్తున్నారు అన్న సమగ్ర వివరాలను సిద్ధం చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు
అనుగుణంగా త్వరలో టీజీ ఫుడ్స్ పనితీరు పై సమీక్ష చేస్తానన్న మంత్రి సీతక్క
శుభ్రతను పాటించాలని సిబ్బందికి ఆదేశాలు
గ్లవ్స్ వాడేలా తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశాలు
ఆహార పదార్థాల నాణ్యత పై లాబ్ నివేదికను తనకు సమర్పించాలని కోరిన మంత్రి సీతక్క