విశాఖపట్నం నగరంలో ఈరోజు అదితి ఈవెంట్ మేనేజుమేంట్ ఆద్వర్యంలో “ ఇండియా జ్యుయలరీ ఫెయిర్ -2024 “ ప్రదర్శన వైజాగ్ కన్వెన్షన్స్, క్రికెట్ స్టేడియం ప్రక్కన, పోతినమల్లయ పాలెం వద్ద ప్రారంభించబడినది. ఈ ఫెయిర్ అక్టోబర్ 4 వ తేదీ నుడి 6 వ తేదీ వరకు మూడు రోజులు పాటు నిర్వహిస్తున్నారు. జ్యుయలరీ ప్రదర్శన మరియు అమ్మకాలు సందర్శకులకు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫెయిర్ నాడు దేశం నలుమూలల నుండి తెచ్చిన విభిన్న డిజైన్స్ ఆభరణాలు అన్ని ఒకే చోట లభిస్తాయి. వారికి కావలసిన ఆభరణాల కోసం వినియోగదారులు ఎలాటి దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన పని ఉండదు. బంగారం, వజ్రాలు మరియు ప్లాటినం తో తయారైన ఆభరణాలు మరియు రత్నాలు పొదిగిన నగలు విస్తృత శ్రేణిలో దేశంలోని విభిన్న ప్రాంతాల సంప్రదాయతలు కలబోసినవి మీకు ఇక్కడ లభిస్తాయి.అదితి ఎక్స్పో ఆంధ్రప్రదేశ్లో అత్యంత విజయవంతంగా నిర్వహిస్తున్నాది. ఈ ఇండియా జ్యుయలరీ ఫెయిర్ నకు మొదటి రోజు విశేష స్పందన లభించినది. ప్రజలు పండుగలకు మరియు వివాహ సీజన్ కోసం ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతారు. తమకు ఇష్టమైన నగల కోసం వారు చెన్నై, హైదరాబాద్, జైపూర్, ముంబై ,కోల్కత్తా, విజయవాడ, బెంగళూరు నగరాలకు వెళ్ళకుండా అక్కడి జ్యుయలరీ వ్యాపారులు అనేక రకాల డిజైన్స్ ఆభరణాలతో ఈ మెగా ఇండియా జ్యుయలరీ ఫెయిర్ లో పాల్గొంటున్నారు. సందర్శకులు అనేక రకాల డిజైన్లను కలిగి ఉంటారు మరియు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. ఈ ఫెయిర్ నిర్వహణకు అన్ని విధాల సహకరిస్తున్న కమిషనరేట్ ఆఫ్ పోలీస్, విశాఖపట్నం వారికి అదితి ఈవెంట్ మేనేజుమెంట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు.
నర్సీపట్నం లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఇసుక పంపిణి చేపట్టాలి.#vvwnews #ysrcp
by vvwnews.com
written by vvwnews.com
49
previous post