ఎండాడలో నరెడ్కో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉత్తరాంధ్ర జోన్ విశాఖ శాఖల ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. నూతన ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రజా ప్రతినిధులను కలిసి విశాఖ చుట్టుపక్కల లేఔట్ లు, అపార్ట్మెంట్లు నిర్మాణం చేపడుతున్న నారెడ్కో సభ్యులందరూ కలిసి నిర్మాణరంగంలో వస్తున్న పలు మార్పులు ప్రభుత్వం అందించవలసిన సహకారాలపై తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు ఈ
కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర నరెడ్కో అధ్యక్షులు గద్దె చక్రధర్ మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం, నివాస గృహము సరసమైన ధరలో అందించాలన్నదే నరెడ్కోఉద్దేశం అని చెప్పారు. విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్ మాట్లాడుతూ మౌలిక రంగ విస్తరణకు ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగం కూడా కలిసి చేస్తే ఫలితాలు బాగా వస్తాయన్నారు. గాజువాక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం విశాఖపట్నం అభివృద్ధికి నిర్మాణరంగం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు . విశాఖ అభివృద్ధికి మరియు విధాన నిర్ణయాలలో NAREDCO సంస్థను కూడా భాగస్వామిని చేస్తామని పేర్కొన్నారు
ఉత్తరాంధ్ర జోన్ విశాఖ శాఖల ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం#vvwnews
53