అంబేద్కర్ ఫ్లెక్సీ చింపిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, దళిత వైద్యునిపై దాడి చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీలను వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి అద్యక్షుడు జె వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆర్టీసీ కాంప్లెక్స్, ఎలసి బిల్డింగ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మొన్న ఉండి నియోజకవర్గం, ఏలూరుపాడులో గుడికి వెళ్ళే దారిలో అంబేడ్కర్ ఫ్లేక్సీ ఉందని టిడిపి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు చింపి వేయడం దారుణం అన్నారు. అదే విధంగా జనసేన పార్టీ కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ రంగరాయ మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ ఉప చైర్మన్, దళిత డాక్టర్ ఉమా
మహేశ్వర్ పై దాడి చేసి అందరిముందు అవమానిం చడం చేశారని, తర్వాత పశ్చాతాపంగా వారి ఇంట్లోనే దీక్ష చేపట్టడం ప్రభుత్వ మంచి పరిపాలన 100 రోజుల గిఫ్ట్ గా ఇస్తున్నట్లుగా ఉందని ఏద్దేవా చేశారు. ఈ సంఘటనలో కాకినాడ ఎస్పీ, కలెక్టరు రాజియత్నం చెయ్యడం సిగ్గుచేటు అన్నారు. కాబట్టి వారిని వెంటనే బదిలీ చేయాలని కోరారు. చట్టాన్ని రక్షించవలసిన వారే ఇలా దిగజారి ప్రవర్తించడం శోచనీయమని, వీడియోలను పరిశీలించి హైకోర్టు సుమోటాగా కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అంబేద్కర్ ఫ్లెక్సీ చింపిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే పంతం నానాజీలను వెంటనే అరెస్టు చేయాలి
56