పోస్టింగుల్లో దళిత
ఉద్యోగులకు వివక్షత చూపించారని భీమసేన వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవ స్థాపకులు రవి సిద్ధార్థ ఆరోపించారు. ఈ మేరకు ఆది వారం ఉదయం నగరంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడుతూ దళితులు ఏ స్థానాల్లో ఉన్న కులం కారణంగా వివక్షత
ఎదు ర్కొంటున్నారన్నారు. దేశంలోని రాష్ట్రపతి హెూదా నుంచి కింద స్థాయి ఉద్యోగం వరకు దళిత ఉద్యోగులు వాళ్ల వాళ్ల స్థాయిలో వివక్షతకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో పోలీసు ఉన్నత అధికారులు దళితు లయితే వారికి అప్రాధాన్యత పోస్టింగు, లేదా పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉంచే పరిస్థితి ఉందన్నారు. విశాఖ రేంజ్ నుండి 60 నుండి 70 స్థానాల్లో ఒకరిద్దరూ తప్ప
దళిత ఆదివాసి ఉద్యోగులకు సిఐల పోస్టింగులు కల్పించలేదని విమర్శించారు. విశాఖ సిటీ పరిధిలోనే 16 మంది ఎస్సీ ఎస్టీ ఇన్స్పెక్టర్లు పోస్టింగ్స్ లేక రిజర్వులో ఉన్నారని తెలిపారు. కుల వివక్షతే ప్రధాన కారణమని, కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించా ల్సిందిగా విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో సంఘం సభ్యులు కూడా పాల్గొన్నారు.
పోస్టింగుల్లో దళితఉద్యోగులకు వివక్షత చూపించారు. #vvwnews #latestnews
53