ఆల్ ఇండియా ఫెడరేషన్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ 18వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి 24,25 తేదీన

by vvwnews.com

ప్రెస్ నోట్ ఆల్ ఇండియా ఫెడరేషన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ 18వ జాతీయ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ తేదీ 22 9 2024 ఉదయం 10 గంటలకి రైల్వే స్టేషన్ ఇన్ గేట్ జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్ల ప్రచార సమావేశం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏ ఐ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామన మూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో అండ్ మోటార్ వాహన ఓనర్ కమ్ డ్రైవర్ల పై ఆర్థిక భారాలు వేసే జీవో నెంబర్ 21 31 రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రమాదాల నివారణ పేరుతో చేసిన 2023 నూతన మోటార్ యాక్ట్ చట్టాన్ని 106/1/2 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దేశ వ్యాప్తంగా డీజలు పెట్రోల్ ధరలను ఒకే విధంగా అమలు చేయాలని పెట్రోల్ డీజిల్ ధరలు జిఎస్టి పరిధిలో తేవాలని దేశవ్యాప్తంగా డ్రైవర్లకు సంక్షేమ బోర్డు చేసి నిధులు కేటాయించాలని కోరారు దేశవ్యాప్తంగా భారీగా పెంచిన టోల్ పంజా గేట్లు ఫీజులను నియంత్రించి రోడ్డు రవాణా రంగాన్ని కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఆటో డ్రైవర్ కి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు రాష్ట్రంలో ఆర్ అండ్ బి రోడ్డులో టోల్ గేట్లు పెట్టాలన్న ప్రతిపాదన విరమించాలి ఆటోలు ఇతర వాహనాలు ఎఫ్ సి ఫిట్నెస్ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే ప్రతిపాదన విరమించాలి డ్రైవర్లకు సామాజిక భద్రత వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని అమలు చేసి డ్రైవర్ల కుటుంబాలు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు సెప్టెంబర్ 24 25 తేదీల్లో బెంగళూరులో జరుగు ఆలిండియా ఫెడరేషన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ 18వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రా వి కృష్ణ వై వెంకట్ ఎస్ చెన్నారెడ్డి హెచ్ ఏ ఖాన్ హెడ్ శేఖర్ జె గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఇట్లు స్టాండ్ అధ్యక్షులు ఎస్ చెన్నారెడ్డి

Use Social Media to Spread the Word about Our News

related articles