మొక్కలు నాటి పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం అని ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ ముకుంద పిలుపునిచ్చారు. శనివారం ఉదయం విఎస్ కృష్ణా డిగ్రీ కళాశాలలో విశాఖ కంటైనర్ టెర్మినల్ అందజేసిన మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. ఔషధ గుణాలు కలిగిన మొక్కలు, పక్షులు గూళ్ళు పెట్టుకునే మొక్కలు, దేశీయ కూరగాయలు, ఆకుకూరలు మొక్కలు నాటి పెంచుదాం అన్నారు. భవిష్యత్తు తరాల కోసం సామాజిక వనాలు పెంచుదామన్నారు. జీవవైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి కృషి చెయ్యాలి అని కోరారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి ఆధారిత వ్యవసాయం ఎంతో అవసరం అన్నారు. జీవవైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ బాబు మాట్లాడుతూ తమ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తారన్నారు. పండ్ల మొక్కలతో తమ విద్యా సంస్థను నందినవనంగా తీర్చి దిద్దుతామన్నారు. విద్యార్థులు అందరూ పర్యావరణ హితంగా జీవించాలని శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరిగుతోంది అన్నారు.
తిరుమల ప్రసాదంలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె ఏంటి ? ఇలాంటివి అసలు వినగలమా ?
64