52
పాయకరావుపేట బృందావనం కాలనీలో పింఛన్ల పంపీణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పింఛన్ల పండగ ఒకరోజు ముందుగానే తీసుకువచ్చారని, చరిత్రలో మొదటిసారి- ఒకరోజు ముందు పింఛన్లు ఇవ్వడం ఈ ఒక్కరోజులోనే 95 శాతం పించన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.
అలాగే రాష్ట్రంలో భారీ వర్షాలు నేపథ్యంలో సీఎం గారు మంత్రులు,అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నమని, అధికారులు ఎప్పటి కప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు.