కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ చట్టం 2020 ను తక్షణమే #vvwnews

by vvwnews.com

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ చట్టం 2020 ను తక్షణమే రద్దు చేయాలని, రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం విరమించుకోవాలని, విద్యుత్తును ప్రైవేటుపరం చేసే చర్యలు ఆపాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఆగస్టు 28 విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ సందర్భంగా విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బషీర్బాగ్ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ముందుగా 2000 ఆగస్టు 28వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ లో జరిగిన ప్రదర్శనలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన బాలస్వామి, రామకృష్ణ, విష్ణువర్ధన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభకు సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ సభ్యురాలు పి.మణి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బోట్ట ఈశ్వరమ్మ, జి అప్పలరాజు, వై రాజు, గౌరీష్, కుమారి, జ్యోతీశ్వరావు,విజయ, అప్పారావు, చంద్రశేఖర్ నర్సింగరావు సిపిఐ నాయకులు మన్మధరావు, అచ్యుతరావు, కాసు బాబు, కాసుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles