పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు పురస్కరించుకొని సామాజిక సేవా కార్యక్రమాలు #vvwnews

by vvwnews.com

జన సేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ వేడుకలు పురస్కరించుకొని సామాజిక సేవా కార్యక్రమాలు విశాఖలో ఈ నెల 30 నుండి వచ్చేనెల సెప్టెంబర్ 2 వరకు పండగ వాతావరణంలో పార్టీ శ్రేణులు, అభిమానులు నడుమ
పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు విశాఖ
దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు,విశాఖ జిల్లా జనసేన అధ్యక్షులు సిహెచ్. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. బుధవారం రాజేంద్రనగర్లో జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా ఆయన  ఆశయాలకు అనుగుణంగా  కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నెల 30న విశాఖ నగరం అంతటా పార్టీ శ్రేణులతో మొక్కలు  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గం అన్ని వార్డుల్లో పోర్టు కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం 5000 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.31న ఆర్కే బీచ్ లో బీచ్ క్లీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, నగరంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని బీచ్ పరిశుభ్రత నిర్వహిస్తారని తెలిపార. మీడియా సమావేశంలో  దక్షిణ నియోజక వర్గం ఇంఛార్జి శివ ప్రసాద్ రెడ్డి,  పశ్చిమ నియోజక వర్గం ఇంచార్జి అంగా ప్రశాంతి, మాజీ కార్పొరేటర్ సూర్య నారాయణ పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles