అధికారులు ఇప్పటికీ వైసీపీ సేవలో తరిస్తున్నారు
విశ్వేశ్వరాయ నగర్ లో రోడ్డుపై డివైడర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు
తక్షణమే ఆ డివైడర్లను ఈ నెల 30 లోగా తొలగించాలి
లేనిపక్షంలో ప్రజలే ఉద్యమంగా తరలివచ్చి తొలగించాలని తెలుగు శక్తి పిలుపు
పంతులుగారి మేడ సమీపంలో గుడివాడ అమర్ అక్రమ కట్టడాన్ని ఎందుకు కూల్చడం లేదు
—– తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ సూటి ప్రశ్న
గాజువాక : రాష్ట్రంలో ప్రభుత్వం మారి రెండు నెలలు గడిచిపోయినా అధికారులు మాత్రం వైసీపీ సేవలో ప్రసన్నం అవుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు. మంగళవారం గాజువాక లోని బెస్ట్ వెస్ట్రన్ రామచంద్ర హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో పల్లా శ్రీనివాసరావుకు చెందిన కట్టడాన్ని కూల్చివేసిన అధికారులు” కోడిగుడ్ల శాఖ” మాజీ మంత్రి గుడివాడ అమర్ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. పంతులు గారి మేడ సమీపంలో అక్రమ కట్టడానికి కేవలం నోటీసు ఇచ్చి మమ అనిపించారన్నారు. ఈ పరిస్థితుల్లో తక్షణమే మార్పు రావాలన్నారు. ఇదిలా ఉండగా శ్రీనగర్ సమీపంలోని విశ్వేశ్వరయ్య వద్ద రహదారిని వన్వేగా మార్చి వేశారన్నారు. దీనివల్ల సుమారు 5000 కుటుంబాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విలువైన సమయంతో పాటు ఇంధనాన్ని అదనంగా కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి డివైడర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. నగరంలోని సిరిపురం జంక్షన్ లో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ తన స్వార్థ ప్రయోజనాల కోసం అదేవిధంగా డివైడర్లను ఏర్పాటు చేశారు అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తక్షణమే సిరిపురం జంక్షన్ లోని డివైడర్లను తొలగించి ప్రజల కష్టాలను నివారించారన్నారు. కానీ విశ్వేశ్వరాయ నగర్ లో మాత్రం ప్రజల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 30వ తేదీలోగా డివైడర్లను తొలగించకపోతే ప్రజలే ఉద్యమంగా తరలివచ్చి వాటిని తొలగిస్తారని.. పెద్ద సంఖ్యలో స్థానికులు తరలిరావాలని బి.వి.రామ్ పిలుపునిచ్చారు.
*ఏనాడు పదవుల కోసం పనిచేయలేదు*
తాను ఏనాడు పదవుల కోసం పనిచేయలేదని కేవలం పార్టీ బలోపేతానికి మాత్రమే తనవంతుగా కృషి చేశానని మండవ జ్యోతి అన్నారు. మన టిడిపి యాప్ ద్వారా కంటెంట్ ప్రజలకు చేరువేయడంలో అత్యధిక పాంట్లు సాధించినందుకు నారా లోకేష్ ద్వారా ప్రశంస పత్రం మరియు అభినందనలు అందుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్న ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. 78 వ వార్డు టిడిపి అధ్యక్షుడు కొల్లి శివ నాగేశ్వరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో పనిచేసే వారికి ఎప్పుడు కూడా తగిన గుర్తింపు ఉంటుందన్నారు.
అనంతరం శ్రీమతి మండవ జ్యోతిను తెలుగు శక్తి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ పప్పూర్ నికుంజ్, జి.అచ్యుతరామయ్య, మన్యం ధీరుడు నిర్మాత మరియు హీరో ఆర్.వి.వి.సత్యనారాయణ, బొల్లినేని వెంకటేశ్వరరావు, అల్లూరి విష్ణువర్ధన్, గుమ్మిడి నరేంద్ర, ఏ.మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.