విత్తన బంతులతో పచ్చదనం పెంపొందించండి
– సుంకరి రామకృష్ణారావు, విశ్రాంత ఉపకులపతి, కృష్ణా యూనివర్సిటీ
విత్తన బంతులతో పచ్చదనం పెంపొందించండి అని కృష్ణా యూనివర్సిటీ విశ్రాంత ఉపకులపతి సుంకరి రామకృష్ణారావు కోరారు. మంగళవారం ఉదయం సింహాచలం కొండ పైభాగంలో లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం విబిఎస్ ప్రసాద్ నేతృత్వంలో దేవతా వృక్షాలు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు విత్తనాలతో తయారు చేసిన విత్తన బంతులు చల్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కనీసం 10 మొక్కలు నాటాలని కోరారు. పచ్చదనం పెంపొందించే విధంగా కృషి చెయ్యాలి అన్నారు.
లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం విబిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ “హీల్ ఎర్త్ ” అనె నినాదం తో తాము పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నాం అన్నారు. ఈ సంవత్సరం పచ్చదనం పెంపొందించే విధంగా కృషి చెయ్యాలి అని నిర్ణయించుకుని విభిన్న కార్యక్రమాలు నిర్వహించడం జరిగుతోంది అన్నారు.
ఈ కార్యక్రమంలో నార్త్ ఈస్ట్ లైన్స్ ప్రెసిడెంట్ ఎం సురేష్, వనితా విభాగం ఎస్ సీతారత్నం, సింహాచలం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు వంకాయల నిర్మల, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొన్నారు.
విత్తన బంతులతో పచ్చదనం పెంపొందించండి- సుంకరి రామకృష్ణారావు, విశ్రాంత ఉపకులపతి, కృష్ణా యూనివర్సిటీ
54