ప్రచురణార్థం
తేదీ: 27-5-24
సర్కులర్ రద్దు చేయాలి
విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉక్కు నగరంలో నివసిస్తున్న కార్మికులకు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఇచ్చిన సర్కులర్ రద్దు చేయాలని 78 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉక్కునగరం పరిపాలన భవనం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దీనిలో పెద్ద ఎత్తున కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ ధర్నాను ఉద్దేశించి డాక్టర్ బి గంగారావు మాట్లాడుతూ కార్మికులపై విద్యుత్ చార్జీల భారాన్ని మోపుతూ యాజమాన్యం తేదీ: 24-4-24 న సర్కులర్ ఇవ్వడం దుర్మార్గమని ఆయన అన్నారు. నేడు స్టీల్ సిఎండి ఈ భారాన్ని మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నాను అని చెప్పారని ఆయన అన్నారు. నేడు ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తిని పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయకుండా వాటిని ప్రైవేట్ వారికి కట్టబెట్టాలని దుర్బుద్ధితోనే ఈ చర్యలు చేపట్టారని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విద్యుత్తును కొనుగోలు చేసే పద్ధతులు మూడు ఉంటాయని వాటిలో ప్రధానంగా కర్మాగారం, గృహపుకరణం, వ్యవసాయం వీటికి వేరువేరు పద్ధతులలో విద్యుత్ ఛార్జీలు అమలు అవుతాయని ఆయన వివరించారు. కర్మాగారం కొన్న రేటుకే గృహ వినియోగదారులు చెల్లించాలని యాజమాన్యం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఇటువంటి అనాలోచిత చర్యలను తక్షణం విరమిచ్చుకోకుంటే ఉక్కునగరంలో ఉన్నత యాజమాన్యం తిరగ లేని స్థితిలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కె విమల, సిపిఎం స్టీల్ డివిజన్ కార్యదర్శి పి శ్రీనివాసరాజు, స్టీల్ సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వైటి దాస్, యు రామస్వామి, స్టీల్ సిఐటియు నాయకులు పుల్లారావు, ఆర్ వెంకట్రావు, కె బాలశౌరి, మొహిద్దిన్ స్టీల్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఉపాధ్యక్షులు వివి రమణ తదితరులతోపాటు అధిక సంఖ్యలో మహిళలు, కార్మికులు పాల్గొన్నారు.
వి ప్రసాద్
కార్యదర్శి