అనకాపల్లి జిల్లా, యలమంచిలి నియోజకవర్గం.
*శాంతి భద్రత పరిరక్షణపై అవగహన సదస్సు*
ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్ పి. మురళీకృష్ణ.
యలమంచిలి నియోజకవర్గంలో అన్నీ పార్టీల నాయకులు, కార్యకర్తలతో ఎస్.పి.మురళీకృష్ణ సమావేశం నిర్వహించారు. అందరి సహకారంతో ఎన్నికల ప్రశాంతంగా జరిగాయని ఎస్ పి, మురళీకృష్ణ అన్నారు
ఎగ్జిట్ పోల్స్, కౌటింగ్ సమయంలో మీరందరూ ప్రశాంతంగా ఉండాలిఅని, జూన్ 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ వద్దకు ర్యాలీగా రావద్దు అని అన్నారు
రాష్ట్రం అంతా 144 సెక్షన్ అమల్లో ఉంది, ఎవరూ గెలిచిన, ఓడినా ప్రశాంతంగా ఉండాలని, కౌంటింగ్ హాల్లోకి సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు కు అనుమతి లేదన్నారు
కౌంటింగ్ వద్ద బాణా సంచాలు కాల్చకూడదు, అనకాపల్లి జిల్లాలో పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది.
అలా జరగడానికి కారణం మీరందరి సహాయ సహకారాలు, దయచేసి ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మీ మీద కేసు పెడితే ఆ కేసు తాలూకా ప్రభావం మీ మీదే కాకుండా మీ వాళ్ళందరి మీద ఆ ప్రభావం ఉంటుంది – ఎస్ పి. మురలికృష్ణ. తెలియజేశారు