Ch.సుందరరావు అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని రౌండ్ టేబుల్ సమావేశం APPTD స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్ SWF

by vvwnews.com

*రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానం*
*ఎపిపిటిడి ఎస్‌.డబ్యు.ఎఫ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు సుందరరావు అక్రమ సస్పెన్షన్‌ ఎత్తివేయాలి.*
*అఖిలపక్ష కార్మిక, ఉద్యోగ, ప్రజాసంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానం.*
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు (ఎపిఎస్‌ ఆర్టీసి) స్టాప్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్‌ సుందరరావు అక్రమ సస్పెన్షన్‌ ఎత్తివేయాలని అఖిలపక్ష కార్మిక, ఉద్యోగ, ప్రజాసంఘాల ఐక్యవేదిక ‘‘రౌండ్‌ టేబుల్‌’’ సమావేశం తీర్మానించింది.
సుందరరావు సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ తేది 24`5`2024 (శుక్రవారం) జగదాంబ వద్ద ఎన్‌పిఆర్‌ భవనంలో సిఐటియు ఆధ్వర్యంలో అఖిలపక్ష కార్మిక, ఉద్యోగ, ప్రజాసంఘాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించింది.
తేది 4`5`2024న సా॥ 6.30 గంటలకు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక సమావేశంలో ఎస్‌.డబ్యు.ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ సుందరరావు పాల్గొన్నారనే కారణంతో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘనగా పేర్కొంటూ న్యాయవిరుద్ధంగా ఎపి పిటిడి యాజమాన్యం ఛార్జిషీట్‌ ఇచ్చి, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా సస్పెన్షన్‌ చేసింది. ఎపి పిటిడికి సంబంధం లేని ఒక పత్రికలో వచ్చిన చిన్న వార్తను సాకుగా చూపి ఈ చర్యలు తీసుకోవడం సరైంది కాదు. ఇది కక్షసాధింపుతో తీసుకున్న చర్య. ఈయనతో పాటు తణుకు డిపో ఎన్‌.ఎం.యు కార్యదర్శి సుబ్బారావును, బహుజన వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు శ్యామ్‌సన్‌, మంగళగిరి డిపో మహిళా కండక్టర్‌ పద్మావతిలను కూడా అక్రమంగా సస్పెండ్‌ చేయడం దుర్మార్గమని ఎపి పిటిడి ఎస్‌.డబ్యు.ఎఫ్‌ సీనియర్‌ నాయకులు వి.తులసీరాం తెలిపారు.
ఆయన మాట్లాడిన అంశం కూడా మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ పరిధిలోనిది కాదు. ఎన్నికల ప్రిసైడిరగ్‌ అధికారి గారి ఆదేశాలు ఉన్నట్లు కూడా ఎక్కడా పేర్కొనలేదు. ఇది అవాస్తవమైన, కక్షపూరితమైన ఎలిగేషన్స్‌, కంప్లైంట్‌లతో పెట్టినది తప్ప మరొకటి కాదు. ఆర్‌టిసిలో ప్రైవేటీకరణ విధానాలు వేగవంతం అవుతున్నాయి. రిక్యూట్‌మెంట్‌లేదు. ఉన్న సిబ్బందిపైన పని ఒత్తిడి పెరిగింది. కొత్త బస్సులు కొనుగొలు లేకపోవడం పాత బస్సులనే మరల మరల రిపేర్లు చేస్తూ నడపడుతున్నారు దీని ఫలితంగా డ్రైవర్లుపై కెఎంపిఎల్‌ వేధింపులు, కండక్టర్లుపై ఇపికె వేధింపులు పెరుగుతున్నాయి. తగినన్ని బస్సులు లేకపోవడం వలన ప్రయాణికుల ఆర్‌టిసి సిబ్బందిపై ఆ కోపాన్ని చూపించి ప్రతి చిన్న విషయానికి ఫిర్యాదులు చేయడం పరిపాటి అయ్యింది. ఇన్ని విధానాలుగా ఆర్‌టిసి సిబ్బంది ఇబ్బంది పడుతున్నప్పుడు యూనియన్‌లను నోరు ఎత్తనివ్వకుండా ఆర్‌టిసి యాజమాన్యాం ఇటువంటి దాడులు చేయడం అన్యాయం. తక్షణమే ఎపి పిటిడి ఎండి గారు జోక్యం చేసుకొని సస్పెన్షన్‌ రద్దుచేసి విధులకు తీసుకొనే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశం కోరుతున్నది.
అన్ని కార్మిక, ఉద్యోగ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలోనూ మరియు ప్రతి సంఘం నుండి సిహెచ్‌ సుందరరావు సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కోరుతూ ఎపి పిటిడి కమీషనర్‌ వారికి మెయిల్స్‌ ద్వారా లేఖలు పంపాలని ఈ రోజు జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశం తీర్మానం చేసింది.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎం.మన్మధరావు, సిఎఫ్‌టియుఐ ఉపాధ్యక్షురాలు కె.లక్ష్మి, స్టీల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఉపాధ్యక్షులు పి.భానుమూర్తి, పబ్లిక్‌ సెక్టార్‌ కో`ఆర్డినేషన్‌ కమిటీ కో`కన్వీనర్‌ కె.కుమార్‌ మంగళం, శ్రామిక మహిళ గౌ॥అధ్యక్షులు పి.మణి, మోటార్‌ ట్రాన్స్‌పోర్టు యూనియన్‌ అధ్యక్షులు కెఎజె రావు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ కోశాధికారి సీతారత్నం, ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, వై.సత్యవతి, హాస్పిటల్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు పి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
భవధీయులు
వి.తులసీరాం

Use Social Media to Spread the Word about Our News

related articles