ప్రెస్ నోట్ తేది: 23-05-2024
పంచామృతాభిషేకం:-
నేటి శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి త్రికాల పంచామృతాభిషేకం సేవలో 30మంది ఉభయదాతలు పాల్గొన్నారు. మరియ నేడు శ్రీ అమ్మవారికి ప్రీతి కరమైన లక్ష్మవారం అయిన౦దున భక్తులు అధిక స౦ఖ్యలో పాల్గొన్నారు.
శ్రీ చక్రానవవర్ణార్చన లక్ష్మీహోమము:-
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా శ్రీ చక్రానవవర్ణార్చన లక్ష్మీహోమం జరుగును ఈ సేవలో నేడు ఇద్దరు ఉభయదాతలు పాల్గొన్నారు. ఈ పూజలో పాల్గొనదల్చిన భక్తులు రూ. 2516/-లు చెల్లించి ముందుగా గాని, లేదా ఆదే రోజు నాడు ఉ.8.00 గం. లలోపు వారి పేరు నమోదు చేసుకొనవచ్చును.
పై ప్రత్యేక పూజను పరోక్ష పద్దతిలో చేసుకొనుటకు ఆసక్తి గల భక్తులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కొత్తరోడ్, అకౌంట్ నెం. 060810011006691, IFSC కోడ్: UBIN0806081 లో చెల్లించవచ్చును. లేదా Online ద్వారా ట్రాన్స్ ఫర్ చేసినవారు మీ యొక్క ట్రాన్సాక్షన్ వివరములు, పూజ జరిపించవలసిన వారి పేరు, గోత్రనామాలు, పూర్తి చిరునామా, ఫోన్ నెంబరు. ఈ క్రింద వాట్సాప్ నెంబర్లు: 8985515989 మరియు మెయిల్ ID endow-eokanaka@gov.in ద్వారా పంపవచ్చును. లేదా aptemples.ap.gov.in నందు బుక్ చేసుకొనగలరు. మరియు అన్నదానం విరాళములు కొరకు అకౌంట్ నెం.060810011050085, IFSC కోడ్ UBIN0806081లో చెల్లించవచ్చును.
పై కార్యక్రమములలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ పి. శ్రీనివాసులు రెడ్డి మరియు భక్తులు పాల్గొనుట జరిగినది.
విశాఖపట్నం శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం పాలాభిషేకం
49