జీవ వైవిద్య ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగం కావాలి ప్రతి ఒక్కరూ కనీసం 10 ముక్కలైనా నాటాలి

by vvwnews.com

జీవ వైవిధ్య ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగం అవ్వాలి
– ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి పెంచాలి
– ఎకో వైజాగ్ ను జయప్రదం చేయాలి
భూగర్భ జలవనరులను పెంపోందించండి
– సుంకరి రామకృష్ణారావు, విశ్రాంత ఉప కులపతి, కృష్ణా విశ్వవిద్యాలయం.
జీవ వైవిధ్య ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగం అవ్వాలి అని కృష్ణా విశ్వవిద్యాలయం విశ్రాంత ఉప కులపతి సుంకరి రామకృష్ణారావు కోరారు. బుధవారం ఉదయం విశాఖపట్నం ఫౌర గ్రంధాలయం లో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ఏక్షన్ ఎయిడ్ సంస్థ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్‌వర్క్ అమలుకు మద్దతు ఇవ్వడం ద్వారా జీవవైవిధ్య నష్టాన్ని ఆపడానికి కృషి చెయ్యాలి అని కోరారు.
జీవవైవిధ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి పెంచే కార్యక్రమాన్ని మొదలెట్టాలని కోరారు. ప్రభుత్వాలు, స్థానిక ప్రజలు, స్థానిక కమ్యూనిటీలు, ప్రభుత్వేతర సంస్థలు, చట్టసభ సభ్యులు, వ్యాపారులు, వ్యక్తులు జీవవైవిధ్య ప్రణాళిక అమలుకు మద్దతునిచ్చే మార్గాలను మెరుగు పరచడానికి ప్రోత్సహించాలన్నారు.
ఎవిఎన్ డిగ్రీ కాలేజ్ జువాలజీ లెక్చరర్ అర్చన మాట్లాడుతూ సముద్రం మన భవిష్యత్తు ఆహార కెంద్రం అన్నారు. సముద్ర జీవరాశిని కూడా కాపాడటం మన బాధ్యత అన్నారు. విద్యార్థులను జీవవైవిధ్య పరిరక్షణ లో ప్రధాన భూమిక వహించేందుకు మనమంతా కృషి చెయ్యాలి అని అన్నారు. జీవ వైవిధ్య వనరులు మనం నాగరికతలను నిర్మించే మూల స్తంభాలు అని గుర్తించాలి అన్నారు. చేపలు దాదాపు 3 బిలియన్ల ప్రజలకు 20 శాతం జంతు ప్రోటీన్‌ను అందిస్తాయని అన్నారు. మానవుల ఆహారంలో 80 శాతానికి పైగా మొక్కల ద్వారానే లభిస్తోందని వివరించారు.
నడుపూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాచకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ హరిత విద్యార్థులను తయారు చేస్తున్నాను అని చెప్పడానికి గర్వంగా అనిపించిందన్నారు. విద్యార్థులను జీవవైవిధ్య పరిరక్షణ ప్రణాళిక లో భాగస్వాములు చేస్తున్నామన్నారు.
సిఫా ట్రస్ట్ సిఇఒ డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ రాష్ట్రంలో 14 వేల మంది విద్యార్థులను గ్రీన్ అంబాసిడర్స్ గా శిక్షణ ఇచ్చామన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 80 శాతం మంది ప్రజలు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం సాంప్రదాయ మొక్కల ఆధారిత మందులపై ఆధారపడుతున్నారని వివరించారు.
ఏక్షన్ ఎయిడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఇర్ఫాన్ మాట్లాడుతూ భారత దేశం నలుమూలలా తమ సంస్థ పనిచేస్తోంది అన్నారు. ప్రధానంగా వల్నరబుల్ కమ్యూనిటీ తో తాము పని చేస్తున్నామని వివరించారు. పర్యావరణ పరిరక్షణ, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్, విపత్తుల సమయంలో బాధితులకు చేయూతనిచ్చె కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో మురళీ నగర్ గార్డెనింగ్ ప్రతినిధులు ఉదయ్ కుమార్, మళ్ళ సరిత, యువ సేవ సంస్థ ప్రతినిధి హరి, పీపుల్స్ పవర్ సంస్థ ప్రతినిధి భాస్కర్, ప్రముఖ ఉపాధ్యాయురాలు పంతులు లలిత, ఎస్ ఎఫ్ ఎస్ విద్యా సంస్థ ఉపాధ్యాయులు శివ లక్ష్మి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, ఏక్షన్ ఎయిడ్ ఫెలోషిప్ ప్రతినిధులు కృష్ణకుమారి, ఇందు తదితరులు మాట్లాడారు

.

Use Social Media to Spread the Word about Our News

related articles