ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్న స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్

by vvwnews.com

ప్రచురణార్థం
తేదీ: 21-5-24

తక్షణమే జీతాలు చెల్లించాలి

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలని స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నేడు స్టీల్ ప్లాంట్ లోని కోకో ఒవేన్, సెంటర్ ప్లాంట్, ఆర్ ఎం హెచ్ పి, బ్లాస్ట్ ఫర్నిస్, ఎస్ఎంఎస్, మిల్స్, ఆక్సిలరీ షాప్స్ అన్ని విభాగాలను విభాగాధిపతి కార్యాలయం ఎదుట స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ లోని ఐ ఎన్ టి యు సి మినహా మిగిలిన కార్మిక సంఘాలన్నీ ధర్నాలు నిర్వహించారు. వీటిలో యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మికుల నినదించారు. అనంతరం విభాగాధిపతు లకు వినతి పత్రం అందజేశారు.
ఈ ధర్నా లను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే లేనివిధంగా నేటి యాజమాన్యం కార్మికుల పై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని వారు తీవ్రంగా విమర్శించారు. కార్మికులకు న్యాయంగా రావలసిన వేతనాలను ఆలస్యం చేసి కార్మికుల ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేస్తుందని వారు వివరించారు. కార్మికులకు వేతనాలు చెల్లించాలని స్థితిలో స్టీల్ యాజమాన్యం లేదని కావాలనే ఈ చర్యలకు దిగిందని వారు తీవ్రంగా తప్పు పట్టారు. కనుక యాజమాన్యం నుండి వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాల ద్వారా ప్రతిఘటించాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వైటి దాస్, యు రామస్వామి, స్టీల్ సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు, బి అప్పారావు, గంగాధర్, టి వి కె రాజు, నీలకంఠం, పుల్లారావు, మరిడయ్య, కె బాలశౌరి, బియ్యం మధుసూదన్, వి ప్రసాద్, కె ఆర్ కె రాజు, డి సత్యనారాయణ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు పరంధామయ్య, సిహెచ్ సన్యాసిరావు, డి సురేష్ బాబు, డి వి రమణారెడ్డి, రామ్ కుమార్ తదితరులతోపాటు అధిక సంఖ్యలో కార్మికులు కార్యకర్తలు పాల్గొన్నారు.
వి ప్రసాద్
కార్యదర్శి

Use Social Media to Spread the Word about Our News

related articles