భూగర్భ జలవనరులను కాపాడుకోవాలి
– జీవవైవిధ్య దినోత్సవంను విజయవంతం చేయండి
– ఎకో వైజాగ్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలి
– ప్రకృతి ఆధారిత పంటల క్షేత్రాలే ఆరోగ్యకరం
– కృష్ణ, జలవనరుల విశ్రాంత శాస్త్రవేత్త, జాతీయ జల శక్తి మిషన్
భూగర్భ జలవనరులను కాపాడుకోవాలి, జీవ వైవిధ్య ప్రణాళికలో భాగస్వాములవ్వండి అని జాతీయ జల శక్తి మిషన్ జలవనరుల విశ్రాంత శాస్త్రవేత్త కృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం సింహాచలం గోశాలలో అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం దృష్టిలోనికి తీసుకుని ఎకొవైజాగ్ కార్యక్రమాన్ని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 22 అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ సమస్త జీవరాశినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిదె అని గుర్తించాలన్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2024 ప్రణాళిక లొ ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. బెంగుళూరులో వలె ఏ నగరంలో కూడా భూగర్భ జలాలు అడుగంటకుండా ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేయాలని కోరారు. నగరవాసులంతా, పచ్చని చెట్లు నాటి పెంచడం, భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చెయ్యాలన్నారు.
సింహాచలం దేవస్థానం ఇంజినీర్ డి. రామరాజు (హరి) మాట్లాడుతూ 100 ఎకరాల్లో జీవవైవిధ్య పరిరక్షణ కోసం విభిన్నమైన చెట్లు తో ఒక సామాజిక వనం పెంచుతున్నామన్నారు. ప్రకృతి ఆధారిత పంటలు పండించుతున్నామన్నారు. పశుపక్ష్యాదులు కోసం ఎక్కడికక్కడ నీటి సౌకర్యం కల్పించామని వివరించారు. సిబ్బందికి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.
ప్రకృతి ఆధారిత రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ మాట్లాడుతూ
ఎకో వైజాగ్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని, ప్రకృతి ఆధారిత పంటలు, మిద్దె తోటలు పెంచి ఆరోగ్యంగా జీవించండి అని కోరారు. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిదె అని అన్నారు. జీవవైవిధ్యం కోల్పోవడం వల్ల మన ఆరోగ్యంతో సహా అన్నింటికీ నష్టం కలుగుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం , ఏక్షన్ ఎయిడ్ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణకుమారి తదితరులు మాట్లాడారు
భూగర్భ జల వనరులను కాపాడుకోవాలి Eco Vizag & గ్రీన్ క్లైమేట్ టీం
51