జీవ వైవిధ్య ప్రణాళికలో భాగం అవ్వండి
– అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం ను జయప్రదం చేయండి
– జీవవైవిధ్య పరిరక్షణ మన భాధ్యత
– ఎకో వైజాగ్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలి
– మిద్దె తోటలు పెంచండి ఆరోగ్యంగా జీవించండి
– డాక్టర్ శశిప్రభ, సిఇఒ, సిఫా ట్రస్ట్
అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవంను జయప్రదం చేయండి, జీవవైవిధ్య పరిరక్షణ మన బాధ్యతగా స్వీకరించాలి అని సిఫా ట్రస్ట్ సిఇఒ డాక్టర్ శశిప్రభ కోరారు. గురువారం ఉదయం సీతమ్మధార లోని డాక్టర్ శశిప్రభ ఇంటి మేడ మీద మిద్దె తోటలో మే 22 అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా ప్రచార కార్యక్రమాన్ని సిఫా ట్రస్ట్, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ లు ప్రారంభించాయి. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2024 ప్రణాళిక లొ మనమంతా భాగస్వామ్యులు అవుదాం అన్నారు. ఎకో వైజాగ్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని, మిద్దె తోటలు పెంచి ఆరోగ్యంగా జీవించండి అని కోరారు. కానీ జీవవైవిధ్యం కోల్పోవడం మన ఆరోగ్యంతో సహా అన్నింటికీ నష్టం వాటిల్లుతుందని వివరించారు.
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ జీవవైవిధ్య పరిరక్షణ ప్రణాళిక లో మనమూ భాగస్వామ్యులుగా చేర్చి
అందరి సహకారంతో జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకుందాం అన్నారు. జీవ వైవిధ్యం అనేది భవిష్యత్ తరాలకు విపరీతమైన, విలువైన ప్రపంచ ఆస్తి అని పెరుగుతున్న మానవ కార్యకలాపాల వల్ల జాతుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది కాబట్టి జాతులు కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిదె అని అన్నారు.
ఏక్షన్ ఎయిడ్ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణకుమారి మాట్లాడుతూ ప్రభుత్వాలు, స్థానిక ప్రజలు, స్థానిక కమ్యూనిటీలు, ప్రభుత్వేతర సంస్థలు, చట్టసభ సభ్యులు, వ్యాపారాలు, వ్యక్తులతో కలిసి జీవవైవిధ్య ప్రణాళిక అమలుకు కృషి చెయ్యాలని అన్నారు. జీవవైవిధ్య పరిరక్షణ ప్రణాళిక లో ప్రతి ఒక్కరూ భాగం కావాలి అన్నారు. జీవ వైవిధ్యం తరచుగా అనేక రకాల మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవుల పరంగా అర్థం చేసుకోబడుతుంది, అయితే ఇది ప్రతి జాతిలో జన్యుపరమైన తేడాలను కలిగి ఉంటుందన్నారు.
గ్రీన్ అంబాసిడర్స్ ప్రతినిధి రామలక్ష్మి మాట్లాడుతూ జీవ వైవిధ్య వనరులు మన నాగరికతలను నిర్మించే మూల స్తంభాలు అన్నారు. చేపలు దాదాపు 3 బిలియన్ల ప్రజలకు 20 శాతం జంతు ప్రోటీన్లను అందిస్తాయన్నారు. మానవుల ఆహారంలో 80 శాతానికి పైగా మొక్కల ద్వారానే లభిస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 80 శాతం మంది ప్రజలు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం సాంప్రదాయ మొక్కల ఆధారిత మందులపై ఆధారపడుతున్నారని వివరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతీ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన ఎం ఎస్ సి ఫుడ్ అండ్ న్యూట్రీషియన్ సైన్స్ ఇంటెర్న్ షిప్ విద్యార్ధులు డి. సంద్య, కె. భార్గవి, పి. హేమ దుర్గా భవాని, జి విన్నీ, సిహెచ్ మౌనిక రాణి, ఐ వైష్ణవి తదితరులు మాట్లాడారు .
మే 22వ తేదీన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవము ను జయప్రదం చేయండి గ్రీన్ క్లైమేట్ టీం & Eco Vizag
57