పక్షులు, పశువులు ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచండి
– జల వనరులు వృధా కాకుండా చర్యలు చేపట్టండి
– ప్రతి ఒక్కరూ తినే పండ్ల విత్తనాలు ఆర బెట్టండి. వర్షాకాలంలో కొండల్లో జల్లుదాం.
– 5 వేలు కుటుంబాలకు ఎకో వైజాగ్ మీద అవగాహన కల్పిస్తాం
– సెల్వి, సిస్టర్, విశాఖ మరియా మేక్స్
పక్షులు, పశువులు ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచండి అని ఆరిలోవ లోని
విశాఖ మరియా మేక్స్ సంస్థ ప్రతినిధి సిస్టర్ సెల్వి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఉదయం సంస్థ కార్యాలయం వద్ద ఎకో వైజాగ్ – జి విఎంసి లో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ పక్షులు, జంతువులు, ఇతర జీవుల కోసం నీరు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎకో వైజాగ్ గురించి 5వేల కుటుంబాలకు అవగాహన కల్పించేందుకు కృషి ప్రారంభించామన్నారు.
ఈ వేసవిలో పక్షులు, పశువులు ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచాలన్నారు. విశ్వం లో ఇంత వరకూ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఒక్క భూగోళం మీద మాత్రమే జీవరాశి ఉందన్నారు. మానవాళి మనుగడ సమస్త జీవరాసులతో పెనవేసి ఉందని, ఏ జీవి అంతరించినా దాని ప్రభావం మానవాళి మనుగడకు ఇబ్బంది కలిగిస్తుంది అని హెచ్చరించారు.
ఏక్షన్ ఎయిడ్ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణకుమారి మాట్లాడుతూ పిచ్చుకల పరిరక్షణకు గూళ్ళు ఏర్పాటు చేయాలని, ధాన్యం, చిరుధాన్యాలు అందుబాటులో ఉంచాలని కోరారు. ప్రతి ఒక్కరూ తాము తినే పండ్ల విత్తనాలు ఆర బెట్టండి. వర్షాకాలంలో కొండల్లో జల్లుదాం అని ఆయన కోరారు. పండ్లు జాతి మొక్కలు, ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కలు, పక్షులు, జంతువులకు ఆహారం అందించే, ఆశ్రయానికి ఉపకరించే చెట్లు అధికంగా పెంచాలని కోరారు.
గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ జల వనరులు దుర్వినియోగం కాకుండా చర్యలు చేపట్టాలనిలని, ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు కృషి చెయ్యాలి అని ఆయన కోరారు. బెంగళూరు లో ప్రజలు నీటి కోసం అల్లల్లాడి పోతున్నారని, ఆ పరిస్థితి విశాఖ నగరంలో రాకముందే అందరూ భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చెయ్యాలి అని అన్నారు. నీరు, చిరుధాన్యాలు పక్షులు జంతువులకు అందుబాటులో ఉంచే మీ పిల్లలు, మనవళ్ళ ఫొటోలు, మీ ఇంటి వద్ద నీరు తాగుతున్న, ఆహారం తింటున్న పశు, పక్ష్యాదుల ఫొటోలు మీ స్టేటస్ లో పెట్టండి, మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయమని చెప్పండి అన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి ప్రతి ఒక్కరినీ స్పందింప చేయండి అని కోరారు. అలాగే ఆ ఫొటోలు 8333849955 వాట్సాప్ నెంబర్ కి షేర్ చేయమని కోరారు. ఈ ఏడాది వేసవిలో ఏ జీవీ చనిపోకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాజేశ్వరి, డివి లక్ష్మి, సీ హెచ్ అక్కమ్మ, ప్రమీల తదితరులు మాట్లాడారు
పక్షులు, పశువులు జీవులకు నీరు ఉంచండి ఆరిలోవ విశాఖ మరియా మేక్స్ సంస్థ సిస్టర్ సెల్వి పిలుపునిచ్చారు
57