గత ఐదేళ్ల కి ఈ ఐదేళ్ల పాలనలో మార్పు మీరే గమనించండి అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

by vvwnews.com

*గతానికి, ఈ ఐదేళ్ల కాలానికి తేడా గమనించండి, గతంలో చంద్రగబాబు వదిలేసిన బకాయిలను కూడా మన ప్రభుత్వమే చెల్లించింది- సీఎం జగన్*

– రూ. 87,612 కోట్ల రైతుల రుణాలు మాఫీచేస్తామని చంద్రబాబు చెప్పారు. బ్యాంకుల్లో బంగారం రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలన్నారు. దీంతో రైతులు నమ్మి అధికారం ఇస్తే.. దారుణంగా మోసం చేశారు

– బేషరుతుగా రుణాలు మాఫీచేస్తానని చెప్పి చివరకు రుణమాఫీ పత్రాలు ఇచ్చి మోసం చేశారు. చివరకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎగరగొట్టారు. చివరకు మన ప్రభుత్వమే చెల్లించింది:

– బాబు హయాంలో రైతన్నలు కట్టిన వడ్డీలు, చక్రవడ్డీలే ఏడాదికి దాదాపు రూ.5-6 వేల కోట్లు. అంత దారుణంగా చంద్రబాబు గతంలో మోసం చేశారు. మనం ఈ ఐదేళ్లలో వైయస్సార్‌ రైతు భరోసా కింద రూ.34వేల కోట్లు ఇచ్చాం, ధాన్యం కొనుగోలు కోసం రూ.65 కోట్లు ఖర్చు చేశాం

Use Social Media to Spread the Word about Our News

related articles