ముఖ్యంగా ఈ సమావేశము కాపులు సమస్యలు వారికి అన్ని రాజకీయ పార్టీలు తగిన గుర్తింపు ఇవ్వాలని ఈ సమావేశం

by vvwnews.com

కాపులకు టిక్కెట్లు ఇచ్చే పార్టీలనే గెలిపిస్తాం

– కాపునాడు జే ఏ సి నేతలు

ఆశీల మెట్ట ( విశాఖ తూర్పు):

విశాఖ జిల్లా కాపు నాడు ఆధ్వర్యంలో కాపు ఉద్యమ జే ఏ సి రౌండ్ టేబుల్ సమావేశం మంగళ వారం మేఘాలయ హోటల్ లో జరిగింది. ఈ సందర్భంగా జే ఏ సీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. కాపు నాడు విశాఖ జిల్లా అధ్యక్షుడు తోట రాజీవ్ మాట్లాడుతూ, కాపు ఉద్యమ జే ఏ సి 2015 నుంచి కాపుల సంక్షేమ కోసం పాటు పడుతుంది అని గుర్తు చేశారు. జాతీయ స్తాయిలో ముద్ర గడ నాయకత్వంలో జైలుకి వెళ్లి, స్టేషన్లలో పడిగాపులు కాసిన నేతలు వున్నారు. చిత్త శుద్ధితో పోరాటం చేసి వెనక్కు చూస్తే బాధ మిగులుతుంది. కాపులకు ప్రభుత్వ భరోసా లేదు. బీసీ జాబితాలో చేరిస్తే మేలు జరుగుతుంది. తమ పోరాటంలో 80 శాతం సక్సెస్ అయ్యాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన రిజర్వేషన్ నివేదిక ఇవ్వాలి. 20 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.
వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లు కావాలి అంటే తమ సమస్యలు కోల్డ్ స్తోరేజి నుంచి తీయాలి అని డిమాండ్ చేశారు. 28 శాతం జనాభా ప్రకారం టికెట్స్ ఇవ్వాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సీట్లు నామినేటెడ్ పోస్టులు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. తూర్పు కాపులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. రాయల సీమ లో కూడా కాపులకు ప్రాధాన్యత లేదు.
కాపు జే ఏ సి ద్వారా ముద్ర గడ పద్మనాభం కి రాజకీయ పార్టీలు సముచిత గౌరవం ఇవ్వాలి అని కోరారు.
కాపు నాడు నేత
సాయి సుధాకర్ మాట్లాడుతూ,
కాపులకు 25 శాతం టిక్కెట్లు ఇవ్వాలి అని కోరారు. ఎక్కువ టిక్కెట్లు ఇచ్చే వారినే గెలిపిస్తాము అని స్పష్టం చేశారు.
గతంలో రెండు టిక్కెట్లు ఇచ్చేవారు. కాపు
ఉద్యమ నేతలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. కాపు నాడు నేత
ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ, జే ఏ సి లో కాపు సమస్యలు మీద చర్చ జరిగింది. కాపులను బీసీల్లో చేర్చాలి అని కుప్పు స్వామీ కమిటీ సిఫారసు చేసినా
అమలు చేయలేదు. ఏటా వెయ్యి కోట్ల తో సంక్షేమం కోసం నిధులు ఇస్తామని మాట తప్పారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు, విదేశీ విద్య, కాపు భవన్లు నిర్మాణం చేస్తాము అన్నారు. సి ఎం జగన్ ఏటా రెండు వేల కోట్లు ఇస్తాము అన్నారు. తీరా ఇప్పుడు అన్ని
పథకాలు కింద కాపులకు 30 వేల కోట్లు ఇచ్చాము అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం
కాపు నేతలు పేర్లు కొన్ని కొత్త జిల్లాలకు పెట్ట లేదు అని విచారం వ్యక్తం చేశారు. కాపులకు
సామాజిక న్యాయం చేయాలి
అని కోరారు.
బాక్సింగ్, జూడో ,రెజ్లింగ్ కోచ్ పాండు రంగ రుక్మాకర్ ను ఘనంగా సత్కరించారు. తైక్వాండో పోటీల్లో కాంస్య పతకం సాధించిన అతని శిష్యుడు నీ సన్మానించారు.
మీడియా సమావేశంలో జిల్లా కాపు నాడు నేతలు
బీ ఎన్ మూర్తి, నక్కా వెంకట రమణ, తోట నగేష్,
కార్పొరేటర్ గంధం శ్రీనివాస రావు, కే.సత్యనారాయణ, శ్రీదేవి,
నల్లా విష్ణు, వాసు రెడ్డి యేసు దాసు, చందు జనార్ధన్, ఆరెడ్డి ప్రకాష్, ముత్యాల రామ దాస్, కిక్కిరెళ్ళ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles