యాంకర్…
తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా విశాఖ నగరంలోని పౌర గ్రంథాలయంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శాంత కుమార్ మాట్లాడుతూ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్, డెత్ బెనిఫిట్ ఫండ్ 10 లక్షల రూపాయలకు పెంచాలనీ, 35 సంవత్సరాల నుండి బార్ కౌన్సిల్ లో నమోదు చేసుకున్న న్యాయవాదులకు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ సౌకర్యం కల్పించాలనీ, మరణించిన న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మ్యాచింగ్ గ్రాంట్ నాలుగు లక్షల రూపాయలు వెంటనే చెల్లించాలనీ డిమాండ్ చేశారు. అదేవిధంగా గవర్నమెంట్ ప్లీడర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, స్టాండింగ్ కౌన్సిల్స్, మరియు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ న్యాయవాదులకు రిజర్వేషన్లు ప్రాతిపదికమైన నియామకం చేయాలనీ, న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
ILA అడ్వకేట్ రౌండ్ టేబుల్ మీటింగ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్
42