*దేశభక్తిని పెంచే చిత్రం ఆపరేషన్ వాలెంటైన్*
– *ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ సినిమా*
– *మార్చి 1 న విడుదల*
– *మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్*
విశాఖ పట్నం:
మెగా ప్రిన్స్ *వరుణ్ తేజ్* హీరోగా *మిస్ వరల్డ్ బాలీవుడ్ నటి మానుసి చిల్లర్* హీరోయిన్ గా
*శక్తి ప్రతాప్ సింగ్* దర్శకత్వంలో భారతీయ హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా *ఆపరేషన్ వాలెంటైన్* చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ శుక్రవారం బీచ్ రోడ్ లో గల పార్క్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ, మార్చి ఒకటో తేదీన విడుదల అవుతుంది అని పేర్కొన్నారు.
విజయ వాడ, విశాఖ నగరాల్లో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
2019 ఫిబ్రవరి లో పుల్వామ ఘటన లో సి ఆర్ పి ఎఫ్ జవాన్లు మరణించడం, కోవర్ట్ ఆపరేషన్ సక్సెస్ తెర కెక్కించాము అన్నారు. భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య దాదాపుగా 50 ఏళ్ల తరువాత జరిగిన వార్
వెనుక వున్న నిజమైన కథ, సి ఆర్ పి ఎఫ్ జవాన్ల మృత్యువాత పడటం కథ, కథనం తో రూపొందిన చిత్రం అని ఆయన వివరించారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో కొత్త బ్యాక్ డ్రాప్ కథతో
సైనికుల త్యాగం ప్రజలకు తెలిసేలా తీసిన ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో విడుదల అవుతుంది అన్నారు. ఇది
దేశభక్తి ప్రతిబిబించే సినిమా అన్నారు. సినిమా పాకిస్థాన్ లో గల
బాల కోట స్థావరాల మీద దాడులు చిత్రంలో చూపించాము అని వివరించారు. ఇది బాయో పిక్ కాదు.
ఇటువంటి సినిమా తీయడం సంతోషకరం అన్నారు.
మంచి సినిమా తీయాలి అన్న సంకల్పం తోఈ సినిమా ద్వారా
దేశ భక్తి పెంచడం ధ్యేయం అన్నారు.
దర్శకుడు తీసిన తొలి సినిమా ఇదే అన్నారు.గత ఏడాదే మహిళలు కూడా పైలట్ గా రంగ ప్రవేశం చేసిన నేపథ్యంలో హీరోయిన్ పాత్ర కీలకంగా వుండేలా దర్శకుడు తీర్చి దిద్దారు అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఆర్మీ లో సైనికుల కష్టం ప్రతిబింబించేలా ఈ సినిమా వుంటుంది అని స్పష్టం చేశారు. వాలంటైన్స్ డే రోజున జరిగిన ఘటన నేపథ్యంలో జరిగిన కథతో తీసిన ఈ సినిమా యువత లో తప్పకుండా దేశభక్తి పెంచుతుంది. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది అన్న నమ్మకంతో వున్నాము అని ముగించారు.