AIDWA ఐద్వా మహిళా హక్కుల సంరక్షణకై బహిరంగ సభలు

by vvwnews.com

*ఐద్వా ప్రదర్శన, సభ ప్రెస్‌నోట్‌*
*మహిళా హక్కులను హరిస్తున్న మోడీ, జగన్‌ ప్రభుత్వాలకు బుద్ధిచెప్పండి*
*హక్కుల రక్షణకై ఐక్య ఉద్యమాలకు సిద్దకండి*
*ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం థావలే*
భారతదేశంలో మహిళా హక్కులను హరిస్తున్న కేంద్రంలో ఉన్న నరేంద్రమోడీ, రాష్ట్రంలో ఉన్న వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాలకు 2024 ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని, మన హక్కుల రక్షణకోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని ఐద్వా అఖిలభారత ప్రధాన కార్యదర్శి మరియం థావలే పిలుపునిచ్చారు.
ఐద్వా అఖిలభారత సమావేశాలు విశాఖపట్నం డాబాగార్డెన్స్‌ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో 23 నుండి 25వరకు జరుగుతున్న సందర్భంగా గురువారం మధ్యాహ్నం సరస్వతీపార్కు నుండి భారీ ప్రదర్శన నిర్వహించింది. ఈ ప్రదర్శన డాబాగార్డెన్స్‌ మీదుగా, ఆర్టీసి కాంప్లెక్స్‌, రామాటాకీస్‌, జివిఎంసి మీదుగా సెంట్రల్‌ పార్కువరకు సాగి అనంతరం సభ జరిగింది. ప్రదర్శనకు ముందుభాగాన మహిళా కోళాటం, డప్పుల దళం నిలిచింది. ప్రదర్శన అగ్రభాగాన మరియం థావలేతో పాటు జాతీయ కోశాధికారి ఎస్‌.పుణ్యవతి, రాష్ట్ర ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవి, రాష్ట్ర నాయకులు వై.సత్యవతి, బి.పద్మ, డా॥జి.ప్రియాంక, ఆర్‌.విమలతో వేలాదిమంది మహిళలు, మహిళా ఉద్యమాలకు సహకరించి సిఐటియు, డివైఎఫ్‌ఐ, ఎస్‌.ఎఫ్‌.ఐ ఇతర ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ ప్రదర్శన సభలో మరియం థావలే పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు 5 కేజీలు బియ్యం రేషన్‌ డిపోలు ద్వారా సరఫరా చేసి పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. దేశంలో విమానపు ఛార్జీలు, ఎసి రైళ్ళ ఛార్జీలను తగ్గించి సాధారణ ప్రజలు ప్రయాణించే రైల్వే, బస్‌, ఇతర రవాణా ఛార్జీలు భారీగా పెంచడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, విద్యుత్‌, ఇతర నిత్యావసర ధరలు భారీగా పెంచుతున్న మోడీ, జగన్‌లు కార్మికులకు వేతనాలు మాత్రం పెంచడం లేదని ధ్వజమెత్తారు.
ఆశ, అంగన్‌వాడీ, మిడ్డేమీల్‌ ద్వారా ప్రజలకు అందించే సేవలకు ప్రభుత్వాలు నిలువనా నిధుల్లో కోతలు విధించి మోడీ, అంబానీ, అధానీలు మాత్రం డ్రైఫ్రూట్స్‌ను భుజిస్తున్నారని విమర్శించారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తున్న మోడీ ప్రభుత్వంపై రాష్ట్రంలో ఉన్న జగన్‌మోహన్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎదిరించకుండా బిజెపికి సేకరించడం చాలా దుర్మార్గమన్నారు. రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం తీవ్ర ద్రోహం చేస్తున్నా జగన్‌ ప్రభుత్వం మోడీ పల్లకి మోయడం తగన్నారు.
సబక్‌సాబ్‌ ` సబ్‌కా వికాస్‌ అంటూ దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుందని, భారత్‌ వెలుగుపోతుందని మోడీ ప్రకటనలలో మాయాజాలముందన్నారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వం రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతులు పెద్దఎత్తున ఉద్యమం చేస్తుంటే ఉక్కుపాదంతో అణివేయడం, బుల్లెట్ల వర్షం కురిపించి రైతుల ప్రాణాలను తీయడాన్ని తీవ్రంగా ఖండిరచారు.
రైతులు, డ్వాక్రా మహిళాలకు రుణ మాఫీ చేయని ప్రభుత్వాలు అంబానీ, అధానీ లాంటి కార్పొరేట్‌ సంస్థలకు 15లక్షల కోట్లు రుణ మాఫీ చేసిందంటే ఈ ప్రభుత్వాలు ఎవరి పక్షాన ఉన్నాయో అర్ధంచేసుకోవాలన్నారు. ఆంధ్రాతో సైతం అనేక రాష్ట్రాల్లో బాలికలు కనిపించకుండా పోవడమంటే శిశు సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుసుకోవాలన్నారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు, మానభంగాలు, హత్యలకు పాల్పడేవారిని మోడీ ప్రభుత్వం సన్మానాలు చేయడం దేశం తలదించుకునేలా చేసిందన్నారు. మోడీ, జగన్‌ కార్పొరేట్‌ విధానాలకు వ్యతిరేకంగా మహిళా లోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

Use Social Media to Spread the Word about Our News

related articles