తెలగ కులాన్ని బిసి జాబితాలో చేర్చాలి
విశాఖపట్నం, ఉత్తరాంధ్రలోని తెలగ సామాజిక వర్గాన్ని బీసీల్లో చేర్చాలని ఉత్తరాంధ్ర తెలగ కుల కన్వీనర్ పిన్నింట్ల వెంకట రామారావు (పి.వి.అర్)అన్నారు. ఈ మేరకు ఆయన నిర్విరామంగా ఇచ్చాపురం నుండి చేస్తున్న పాదయాత్ర శుక్రవారం విశాఖ నగరానికి పెద్ద ఎత్తున చేరుకుంది. ఎండాడ, విశాలాక్షినగర్,సాగర్ నగర్, అరిలోవ, తాటిచెట్లపాలెం, నక్కవాని పాలెం,మురలీనగర్, మీదగా అక్కయ్య పాలెం చేరుకుంది . అక్కడ నగర తెలగ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున అఖండ స్వాగతం పలికి జై జై తెలగ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి వారి మద్దతు, సంఘీభావం తెలిపారు.తెలగ సంఘాలు, దొరయూత్ నేతలు, గ్రామస్థులు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు.పివియర్ మాట్లాడుతూ ఇరవై రోజుల కిందట ఇచ్చాపురం నుంచి పాద యాత్ర చేపట్టానని, దీన్ని పాయకరరావుపేటలో ముగిస్తానన్నారు.గత 40 సం॥లుగు తెలుగ కులస్థులు ప్రతిభ ఉన్నా ఉన్నత చదువులకు దూరంగా ఉన్నారని, ఆర్థికంగా వెనుక బడి ఆకలి బాదలతో జీవిస్తున్నారన్నారు. నెల నెలా వేలు మంది తెలగ కులస్థులు ఆకలి భాధలు తట్టుకోలేక వలసలు వెళ్లి పొట్ట చేత్తో పట్టుకొని జీవిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో తెలగ కులస్థులను బిసిల్లో చేర్చాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని అయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలగ సంఘ నేతలు మరియు తాటిచెట్టి సంతోష్ కుమార్
,పట్టెపు నాగేశ్వరరావు,మోగంటి రవి, సిద్దాంతం అప్పారావు, వెంపలి ఆనంద్ , అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.