కార్మికుల హక్కుల సాధనకు పోరాడండి 140 వ మేడేని పోరాట దినంగా పాటించండి #vvwnews

by vvwnews.com

ప్రెస్ నోట్ కార్మికుల హక్కుల సాధనకు పోరాడండి 140 వ మేడేని పోరాట దినంగా పాటించండి ఎన్ ఎఫ్ ఐ ఆర్ టి డబ్ల్యూ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి పిలుపు ప్రపంచ కార్మిక దినోత్సవం 140వ మేడేను పోరాట దినంగా పాటించాలని కోరుతూ తేదీ 01- 5-2026 ఉదయం 8 గంటలకి మధురవాడ జంక్షన్లో 8:30 కి స్టాండ్ అధ్యక్షులు దుర్గారావు బోయపాలెం జంక్షన్ రాధాకృష్ణలో 9 గంటలకి వాంబేకాలనీ రాజు కృష్ణలో ఆటో స్టాండ్ లో ఏ ఐ టి యు సి ఎర్రజెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్ ఎఫ్ ఐ ఆర్ టి డబ్ల్యూ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామన మూర్తి పాల్గొని మాట్లాడుతూ అమెరికా చికాకోనగరంలో 1886 మే1న 8 గంటల పని దినాలను అమలు చేయాలని కార్మికులకు కనీస హక్కులుకల్పించాలని జరిగిన పోరాటంలో నాటి అమెరికా అధ్యక్షులు జాబ్ చక్రవర్తి పోలీస్ బలగాలతో కార్మికులు కార్మికులపై జరిపిన తుపాకీ కాల్పుల్లో ప్రాణాలర్పించిన అమరవీరుల రక్తము నుంచి తడిచే వెలిసిన ఎర్రజెండా అని కొనియాడారు నాడు పోరాడి సాధించుకున్న సంఘం పెట్టుకునే హక్కు పనిగంటలు పీఎఫ్ ఈఎస్ఐ సమ్మె చేసే హక్కును కనీస వేతనాల చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్లనుతెచ్చి బడ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు రాయితీలు కల్పించికార్మికుల శ్రమ దోపిడీని చేస్తుందని మండిపడ్డారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా కార్మికులపై ఆర్థిక భారాలు వేస్తూ పెట్రోల్ డీజిల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ టోల్ పంజా ఫీజులు భారీగా పెంచిందని విమర్శించారు డ్రైవర్లకు పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేసి డీజీలు పెట్రోల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ టోల్ పంజాఫీజులు 30% తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరతను అరికట్టి డ్రైవర్లకు జీవన ఉపాధి కల్పించాలని నో స్టాక్ బోర్డులు పెట్టిన పెట్రోల్ బంక్ లైసెన్స్ రద్దు చేయాలని యజమాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు రాధాకృష్ణ కొల్లి సన్యాసిరావు అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఇట్లు స్టాండ్ అధ్యక్షుడు దుర్గారావు

Use Social Media to Spread the Word about Our News

related articles