ఆల్ తెలుగు ప్రజా పార్టీ బీసీ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అదే మా సంకల్పం

by vvwnews.com

ప్రజలందరినీ లక్షాధికారులను చేయడం… బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయడం… అవినీతి రహిత పాలనే ధ్యేయంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆల్ తెలుగు ప్రజా పార్టీ అవతరించింది. ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించి సుపరిపాలన అందించే ఉద్దేశంతో తమ పార్టీ పనిచేస్తుందని ఆ పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకురాలు ఎం సంధ్య విశాఖలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి అఖండ విజయం సాధిస్తామని దీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఉన్న పార్టీలు అవినీతిని ప్రోత్సహిస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి కుటుంబ రాజకీయాలు చేస్తున్నయని సంధ్య విమర్శించారు. జీరో మనీ పాలిటిక్స్ నినాదంతో ప్రజల్లోకి వెళ్లి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తామని వెల్లడించారు. ప్రజా ఉపయోగకరమైన మేనిఫెస్టోతో తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.
———
బైట్: ఎన్. సంధ్య, ఆల్ తెలుగు ప్రజా పార్టీ, విశాఖ పార్లమెంటు పరిశీలకురాలు.
——— (ఓవర్).

Use Social Media to Spread the Word about Our News

related articles