పల్లెకు పోదాం ప్రచారం చేద్దాం
– గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు పర్యటన
– బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీవిశ్వనాథ రాజు
లాసన్స్ బే కాలనీ
( విశాఖ తూర్పు) :
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీవిశ్వనాథ రాజు పేర్కొన్నారు.
లాసన్స్ బే కాలనీ లో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన
విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు దేశంలోని ఏడు లక్షల గ్రామాలలో బీజేపీ కార్యకర్తలు 17 కోట్ల మంది ప్రజలను కలిసి కేంద్ర పథకాలు వివరిస్తారు. రాష్ట్రంలో 22 వేల పంచాయతీలలో ఈనెల 9,10,11 తేదీల్లో లబ్ధిదారులను కలిసి పథకాలు వివరిస్తారు అని పేర్కొన్నారు.
స్వచ్ఛ భారత్, పి ఎం ఎ వై పక్కా ఇళ్ళు, వంటి పథకాలు మీద ప్రచారం చేస్తాము అన్నారు. మొత్తం 18 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తాం అని తెలిపారు. సంఘ్ పరంగా పార్టీ పటిష్ఠత కోసం కృషి చేస్తాము అన్నారు. భారత్ బ్రాండ్ పేరిట కేంద్రం
నాణ్యమైన బియ్యం రూ.29 కి, చేనగ పప్పు 60 కి , గోధుమ పిండి ను రూ.26 కి ఇస్తున్నారు అని గుర్తు చేశారు. అంగన్వాడిల ద్వా ర బాలింతలకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. రైల్వే జోన్ కోసం ముడసర్లోవ ముంపు ప్రాంతాలను కేటాయించడం అన్యాయం అన్నారు.
. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మేడ పాటి మాట్లాడుతూ,
పల్లెకు పోదాం
కార్యక్రమంలో భాగంగా కేంద్ర పథకాలు గురించి ప్రచారం చేస్తాము అన్నారు.విశాఖ పట్నం అభివృద్ధికి కేంద్రం ఎంతగానో కృషి చేసింది అని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తాము అన్నారు. మీడియా సమావేశంలో బీజేపీ విశాఖ జిల్లా లీగల్ సెల్ కో కన్వీనర్ డి వీ ఎన్ ఎల్ అరుణ కుమారి, జిల్లా మీడియా ప్యానలిస్ట్
సేనాపతి మహేశ్, పాల్గొన్నారు.