అప్పుల ఊబిలో ఏపీ అని తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇన్చార్జ్
గండి బాబ్జీ అన్నారు గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జి మాట్లాడుతూ ఏపి బడ్జెట్ కేవలం అంకెల గారడి అని చెప్పారు ఎఫ్.ఆర్.బి.ఎమ్ లిమిట్స్ కూడా దాటిపోయి సుమారు 7 లక్షల మూడు వేల కోట్లు అప్పు చేశారు అని అన్నారు ప్రజలపై మొత్తం11లక్షల కోట్లు అప్పుభారాన్ని మోపారు సంక్షేమం కోసం 127 సార్లు బటన్ నోక్కాను రెండుసార్లు నాకోసం బటన్ నొక్కలేరా అని జగన్ అడుగుతున్నారు అమ్మ ఒడి నాలుగోసారి ఇవ్వలేదు
గ్రామీణాభివృద్దికి ఎక్కడ ఖర్చుపెట్టావో చూపించాలి
పంచాయతీ నిధులు స్వాహా చేశారు అని అన్నారు
పోలవరం ప్రాజెక్టు నుంచి విశాఖపట్నం కు ఇరవై ఐదు టీఎంసీ ల నీరు కావాలి
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి
రెండు వేల కోట్లు ఇచ్చామన్నాడు ఒక్క తట్టపని కూడా చేయలేదు బటన్ నొక్క కుండానే మద్యం మీద 10 వేల కోట్లు సంపాదించాడు దానికి లెక్కా పత్రం లేదు అని అన్నారు నాడు నేడు మూడు వేల కోట్లు కేటాయించి వెయ్యి కోట్లు లంచాలే తినేశారు అని ఆరోపించారు అదానీ చేపట్టే హైడ్రోపవర్ కోసం రైవాడ రిజర్వాయర్ కేటాయించారు నాలుగు నెలలకు తొంబై నాలుగు వేల కోట్ల ఖర్చుకు పద్దు ఆమోదించుకున్నారు దేనికోసం కేటాయిస్తారు అని ప్రశ్నించారు సంక్షేమానికి నలబై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నట్లు చెప్పావు యాబై ఎనిమిది వేల కోట్లు లోటు వుంది రెవిన్యూ లోటు 24 వేల కోట్లు వుంది ఏమి చేయాలనుకుంటున్నావో చెప్పాలని డిమాండ్ చేశారు
వంశధార, తోటపల్లి, వెంగళరాయ సాగర్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు
స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద కేంద్రం ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేస్తున్నారు అని అన్నారు
ఎలక్షన్ల ముందు ఆరు వేల ఉద్యోగాలిస్తామని మభ్యపెట్టి మోసం చేస్తున్నారు అని అన్నారు
కె గోపాల్ రెడ్డి
మీడియా కోఆర్డినేటర్
జిల్లా తెలుగుదేశం పార్టీ