జీవీఎంసీ స్పోర్ట్స్ ఏరినాలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు.. విజేతలకు బహుమతుల ప్రదానం*

by vvwnews.com

*జీవీఎంసీ స్పోర్ట్స్ ఏరినాలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు.. విజేతలకు బహుమతుల ప్రదానం*

*డిసెంబర్‌లో రూ. 7 లక్షల ప్రైజ్ మనీతో ఇంటర్నేషనల్ టోర్నమెంట్!*

ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణంలో ప్రారంభమైంది. పిల్లల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు, వారిని క్రీడల వైపు ప్రోత్సహించేందుకు ఈ ప్రత్యేక టోర్నమెంట్ నిర్వహించారు. ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్, శ్రీ చెస్ అకాడమీ, చైతన్య చెస్ అకాడమీ, ఆంధ్ర చెస్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఎం.వి.పి కాలనీలోని జీవీఎంసీ స్పోర్ట్స్ ఏరినాలో ఈ ప్రతిష్టాత్మక పోటీలకు వేదికైంది. ఈ సందర్భంగా ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, టోర్నమెంట్ డైరెక్టర్ డా.రంగాల బాబురావు మాట్లాడుతూ.. జిల్లాలోని పిల్లల ప్రతిభను మెరుగుపరచడమే మా ముఖ్య ఉద్దేశమన్నారు. తల్లిదండ్రుల కోరిక మేరకు ఈసారి రాష్ట్ర స్థాయి పోటీలను లక్ష రూపాయల ప్రైజ్ మనీతో నిర్వహించినట్లు చెప్పారు. అలాగే రాబోయే డిసెంబర్ 10, 11, 12, 13 తేదీలలో 7 లక్షల భారీ నగదు బహుమతితో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ.. బాబూరావు వయసుతో నిమిత్తం లేకుండా ఒలింపిక్ రన్నర్ లాగా ఈ టోర్నమెంట్ విజయం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, అయన అంకితభావం ఎందరికో ఆదర్శమని కొనియాడారు. అనంతరం విజేతలకు ట్రోఫీను, నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చెస్ అకాడమీ డైరెక్టర్, వి.శ్రీకాంత్, ఆల్ విశాఖ చెస్ అసోసియేషన్ సభ్యులు మణికంఠ, S3 స్పోర్ట్స్ ఏరినా అధినేత సహాని తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles