గాజువాక, న్యూస్ లీడర్,జూన్ 17: దళితుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ #vvwnews

by vvwnews.com

రాష్ట్ర ఎస్ సి కమిషన్ ఆధ్వర్యంలో దళితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్..

గాజువాక, న్యూస్ లీడర్,జూన్ 17: దళితుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావడ సీతారాం బుధవారం గాజువాక తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దళితుల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం రావడ సీతారాం మాట్లాడుతూ దళిత గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీ చేపడుతున్న అభివృద్ధి పనులను దళితులకే కేటాయిస్తే వారు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతారని అన్నారు. దళితుల అభివృద్ధి కోసం గత 30 ఏళ్లుగా తాను వివిధ స్థాయిల్లో కృషి చేస్తున్నట్లు తెలిపారు.73వ వార్డు కర్ణవాణిపాలెంకు చెందిన అనురాధ అనే మహిళ తనకు చెందిన 400 గజాల స్థలాన్ని ఓ టీడీపీ నాయకుడు ఆక్రమించుకున్నాడని కమిషన్ సభ్యుడికి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అప్పటి గాజువాక సీఐ పార్థసారధికి ఫిర్యాదు చేసినప్పటికీ, తనపైనే తప్పుడు కేసులు నమోదు చేసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.మింది ప్రాంతానికి చెందిన మచ్చి అంబేద్కర్ మాట్లాడుతూ సర్వే నంబర్ 28లో తమ పూర్వీకుల ఆస్తిగా ఉన్న 3.10 ఎకరాల భూమిలో రెండు ఎకరాలను కొందరు నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై గాజువాక తహసీల్దార్ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని తెలిపారు. న్యాయపోరాటానికి దిగితే గాజువాక ఆర్‌ఐ తనను బెదిరించే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఆర్డీవో దిలీప్ చక్రవర్తి, గాజువాక తహసీల్దార్ త్రినాథ్, జోనల్ కమిషనర్ బి.ఆర్. శేషాద్రి, గాజువాక ఏసీపీ శ్రీనివాస్, సీఐ గణేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్�

Use Social Media to Spread the Word about Our News

related articles