వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో నగర క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం #vvwnews

by vvwnews.com

విశాఖలో థార్/దాహోడ్ దొంగల ముఠా కలకలం.
క్రైమ్ పోలీసుల హెచ్చరిక.

విశాఖ:
విశాఖలోని గాజువాక ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో నగర క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు.ప్రస్తుతం నగరంలో థార్/దాహోడ్ అనే ప్రమాదకర దొంగల ముఠా సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఆరుగురు సభ్యులు గల ఈ గ్యాంగ్ ఇనుప రాడ్లతో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతోంది.ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లేవారు విలువైన వస్తువులు,నగదు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు.

Use Social Media to Spread the Word about Our News

related articles