కేంద్రం ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి వికసిత రోజ్ గార్ యోజన పథకాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి దేశ వ్యాప్తంగా 200 ప్రదేశాల్లో వర్క్ షాప్ లు నిర్వహిస్తున్నారని విశాఖపట్నం ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ అమర్దీప్ మిశ్రా చెప్పారు. విశాఖపట్నం పిఎఫ్ ఆఫీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మిశ్రా మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో ఈ నెల 19 న విశాఖలో సాలిగ్రామపురం లో సాగర మాల కన్వన్షన్ సెంటర్ లో, విజయనగరం లో వర్క్ షాప్ లు జరుగుతాయన్నారు. వర్క్ షాప్ కు విశాఖ ఎంపీ భరత్ తో పాటు సీనియర్ ప్రభుత్వ అధికారులు సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు. ప్రధానమంత్రి గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభించిన ప్రధానమంత్రి విక్సిత్ భారత్ రోజ్గార్ యోజన భారీ స్థాయిలో అధికారిక ఉపాధి కల్పనను ప్రోత్సహించడం, అన్ని రంగాలలో సామాజిక భద్రతా కవరేజీని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక చారిత్రాత్మక ఉపాధి-అనుసంధాన ప్రోత్సాహక పథకం అని వివరించారు. ఈ పథకం ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలులో ఉందన్నారు. రెండేళ్ల కాలంలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహిస్తుందని అంచన అని పేర్కొన్నారు.
కేంద్రం ప్రవేశ పెట్టిన ప్రధాన మంత్రి వికసిత రోజ్ గార్ యోజన పథకాన్ని ప్రజల్లోకి !! #vvwnews
4