శ్రీకాకుళం జిల్లా పోలీసు
పత్రికా ప్రకటన.
హత్య కేసును ఛేదించిన శ్రీకాకుళం టూ టౌన్ పోలీసులు.
భార్యతో పాటు కుమారుడు, అల్లుడు అరెస్ట్.
కేసు వివరాలు వెల్లడించిన టౌన్ డీఎస్పీ వివేకానంద.
శ్రీకాకుళం, జూన్ 08. శ్రీకాకుళం పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రకాష్‌నగర్ కాలనీలో ఈ నెల 4వ తేదీ రాత్రి జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మృతుడు ధర్మాన అసిరి నాయుడును భార్య A 1 , జయలక్ష్మి, కుమారుడు A 2, మణికంఠ, అల్లుడు A 3 ,చల్ల రాజు (సారువ కోట మండలం)కలిసి హత్య చేసినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ వివేకానంద సోమవారం వెల్లడించారు.మృతుడు అసిరి నాయుడు కార్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, కుమారుడు మణికంఠ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. అల్లుడు కార్పెంటర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అసిరి నాయుడికి మద్యం సేవించే అలవాటు ఉండటంతో తరచూ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా భార్యతో గొడవలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం జయలక్ష్మి,కుమారుడు, అల్లుడు కలిసి అసిరి నాయుడిని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఘటన జరిగిన రోజు రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన అసిరి నాయుడు భార్యతో మరోసారి వాగ్వాదానికి దిగాడు. ఈ సమయంలో ముందుగా సిద్ధంగా ఉన్న కుమారుడు, అల్లుడు కూడా అక్కడికి వచ్చి హత్యకు పాల్పడ్డారు. భార్య మొదట కర్రతో, అనంతరం కూరగాయలు కోసే కత్తితో దాడి చేయగా అసిరి నాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతడికి విషపదార్థం తాగించేందుకు ప్రయత్నించినట్లు,అలాగే భార్య నోరు మూసి పట్టుకోగా కుమారుడు, అల్లుడు కలిసి చీరతో మెడ బిగించి హత్య చేసినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు.హత్య అనంతరం ఘటనను తప్పుదారి పట్టించేందుకు కుమారుడు ద్వారా డయల్ 112 నెంబరుకు ఫోన్ చేయించినట్లు,భార్య తానే నేరం చేసినట్లు నిర్ణయించుకున్నారు.అయితే కేసు దర్యాప్తులో భాగంగా కుమారుడు ఫిర్యాదు ఇచ్చిన అనంతరం కేసు ఇంక్వెస్ట్ కు రాకపోగా,పలు అనుమానాస్పద అంశాలు కనిపించడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.విచారణలో జయలక్ష్మిని ప్రశ్నించగా, తాము ముగ్గురం కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. అనంతరం నిందితులు సోమవారం ఉదయం వీఆర్వో సమక్షంలో లొంగిపోయారు.టూ టౌన్ సీఐ ఈశ్వర రావు ఆధ్వర్యంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీ వివేకానంద వెల్లడించారు.