విత్తనాల బంతులతో పర్యావరణాన్ని పరిరక్షించుదాం అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం పాడేరు డిఎఫ్ఒ ఉమామహేశ్వరి అధ్యక్షతన అటవీ శాఖ కార్యాలయం వద్ద, సాయంత్రం చింతపల్లి డిఎఫ్ఒ నరసింహామూర్తి నేతృత్వంలో అటవీ శాఖ కార్యాలయం వద్ద విత్తనాల బంతులు తయారు చేయడం మీద అవగాహన కల్పించడం జరుగింది. ఈ కార్యక్రమాలలొ ఆయన మాట్లాడుతూ సామాజిక వనాలు విత్తనాల బంతులతో పెంచుదాం అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి అని కోరారు. మన చేతుల్లోనే మన వాతావరణం ఉంటుంది అని వివరించారు. విత్తనాల బంతులతో పచ్చదనం పెంపొందించుదాం అని. 70 శాతం ఆవు పేడ, 30 శాతం మట్టి, 3 విత్తనాలు వినియోగించి విత్తనాల బంతులు తయారు చేయాలి అని కోరారు. ప్రకృతి ఆధారంగా బ్రతికె మనం ప్రకృతి వనరులను కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు. వేడెక్కుతున్న శీతోష్ణస్థితిని చల్లపరిచేందుకు ప్రతి ఒక్కరూ విత్తనాల బంతులతో సామాజిక వనాలు పెంపొందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రేంజ్ అధికారులూ, సెక్షన్ అధికారులు, వన సంరక్షణ సంస్థల ప్రతినిధులు, ఇతర సిబ్బంది పాల్గొని మాట్లాడారు.
విత్తనాల బంతులతో పర్యావరణాన్ని పరిరక్షించుదాం #vvwnews
4