లక్సిoపేట ప్రత్యేక కోర్టు జడ్జిని మార్చండి..**న్యాయాన్ని కాపాడండి..* #vvwnews

by vvwnews.com

*
*విదసం నేత డాక్టర్ బూసి డిమాండ్*
2012 నాటి లక్షీo పేట మారణ కాండపై విచారణ జరుపుతున్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తిరుమల రావు గారి నీ బదిలీ చేసి బాధితులకు న్యాయం చేయాలని విదసం (విస్తృత దళిత సంఘాల) ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు డిమాండు చేసారు..
లక్షీo పేట మృతుల కుటుంబాలకు న్యాయం కోసం ప్రభుత్వం నియమించిన ఓపెన్ కోర్టు న్యాయమూర్తి వల్ల బాధితులకు న్యాయం జరిగేలా లేదని తక్షణమే న్యాయమూర్తి నీ బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు విదసం నేతృత్వంలో విశాఖ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.. ఈ ధర్నానుద్దేశించి వెంకట రావు మాట్లాడుతూ 2012 జూన్ 12 పొద్దున్నే చద్దన్నాలు తింటున్న మాల పల్లి పై తూర్పు కాపులు బాంబులు, బరిశెలు, కత్తులు, గొడ్డల్లతో వచ్చి కళ్ళల్లో కారం చల్లి కిరాతకoగా చేసిన హత్యాకాండలో 5 గురు దళితులు చనిపోయారని గుర్తు చేశారు. నాడు దళిత సంఘాల పోరాటం ఫలితంగా ప్రభుత్వo లక్షీo పేట లోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిందని ఈ 14 ఏళ్లుగా జరుగుతున్న న్యాయ ప్రక్రియ నేడు కీలక దశకు చేరిo దన్నారు.. లక్షీo పేట కోర్టుకు శ్రీకాకుళం సెషన్ కోర్టునుండి వస్తున్న న్యాయమూర్తి తీరు పలు అనుమానాలకు తావిస్తుంది అని బాధితులు హైకోర్టుకు తెలిపారన్నారు. నిష్పక్షపాతంగా న్యాయం వైపు నిలబడాల్సిన న్యాయమూర్తి హంతకులకు అనుకూలంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుంది అన్నారు. డిఫెన్స్ వారికి అన్ని అవకాశాలు ఇస్తూ ప్రాసిక్యూషన్ అభ్యర్థనను బాదితుల విజ్ఞప్తి నీ ఏకపక్షంగా తోసిపుచ్చడం జరుగుతుందని ఆరోపించారు . గత రెండేళ్లుగా ఈ కేసు వాదనకు ప్రత్యేక ప్రాసిక్యూటర్ లేరు.. బాధితులు కోరిన వారిని ప్రభుత్వం నియమించలేదు . ఈ లోగానే జడ్జిగారే ఒక న్యాయవాదిని నియమించి ట్రయిల్ కొనసాగించడంలో కుట్ర దాగి ఉందని వెంకట రావు ఆరోపించారు.. ప్రాసిక్యూషన్ తరపున సాక్షులు అందరూ ఒకేరోజు రావాలనీ , మీకు సమయం ఇవ్వడం వల్ల నిందితులు ఇబ్బంది పడుతున్నారు , నిందితులకు అసౌకర్యం కల్పించకండి అంటూ బాధితులను బెదిరిస్తూ హంతకుల పట్ల జడ్జి గారు సానుకూల వ్యాఖ్యలు, సానుభూతి ప్రదర్శించడం సహజ న్యాయ ప్రక్రియకు విరుద్దం అన్నారు. న్యాయ ప్రక్రియ బయటకు తెలియకూడదనే కుట్రతో గ్రామంలో 144 సెక్షన్ విధించి మీడియా ను కూడా రానీయకుండా దోషులను కాపాడేందుకు న్యాయ మూర్తి గారు ప్రయత్నిస్తున్నట్టు బహిర్గతం ఆయన పరిస్తితుల్లో ఈ కేసులో వారు ఇచ్చే తీరుపై బాధితులకు నమ్మకం లేదన్నారు .న్యాయ మూర్తిని బదిలీ చేయాలని ఇప్పటికే హైకోర్టును కోరామన్నారు .. తక్షణమే న్యాయమూర్తిని బదిలీ చేయాలని వెంకట రావు డిమాండ్ చేశారు.. గుడివాడ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో , యడ్ల గోపి, గ, గోడి వెంకటేశ్వర రావు, గుడాల ఈశ్వర రావు, పి భాస్కర రావు, బి ఉమా మహేశ్వరి, గుడివాడ భాస్కర రావు, చక్కా రాంబాబు, నావేటి గురుదేవి, ఉదయ్, కైలాస్ నాయక్, చాపల దాలయ్య, తదితరులు పాల్గొన్నారు..

Use Social Media to Spread the Word about Our News

related articles