దళిత కార్మిక హక్కుల సాధనకు పోరాడండి !! #vvwnews #visakhanews

by vvwnews.com

ప్రెస్ నోట్ దళిత కార్మిక హక్కుల సాధనకు పోరాడండి జె.వి ప్రభాకర్ పిలుపు ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా తేదీ 9- 4- 2026 ఉదయం 11 గంటలకి నరసింహనగర్ రైతు బజార్ వద్ద కరపత్రాలు ప్రచార కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిహెచ్ పిఎస్ జిల్లా అధ్యక్షులు జేవి ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదట కార్మిక మంత్రిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు కార్మికులకు కష్టజీవులకు అనేక కార్మిక చట్టాలు చేసిన ఘనత అంబేద్కర్ గారికి దక్కుతుందన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న డాబాగార్డెన్ అంబేద్కర్ విగ్రహం నుండి రామ టాక్స్ అంబేద్కర్ భవనం వరకు ప్రదర్శన మరియు బహిరంగ సభ జరుగుతున్నాయి ఈ ప్రదర్శన బహిరంగ సభలో ప్రజల పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు కోడలుగామార్చి కార్మికుల హక్కులను హరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పనిగంటలు తగ్గించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో దళిత బహుజనులు కార్మిక వర్గం పోరాడుతాదని హెచ్చరించారు కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు జి వామనమూర్తి రావి కృష్ణ జీ నీలకంఠం పి సాయికుమార్ కృష్ణవేణి చందర్రావు పి అనీలు రవణమ్మ తదితరులు పాల్గొన్నారు ఇట్లు జి వామనమూర్తి

Use Social Media to Spread the Word about Our News

related articles