టీడీపీ సీనియర్ నాయకురాలు ముత్యాల హరిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గం 14 వ వార్డు బాలయ్య శాస్త్రి లేఅవుట్ దరి ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పుట్టినరోజు సందర్భంగా గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించారు. గర్భిణులకు పసుపు, కుంకుమ, స్వీట్లు, పూలు, పండ్లు, చీర, గాజులతో సాంప్రదాయబద్ధంగా అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా హరిత మాట్లాడుతూ.. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం తనకు ఎంతో ఆనందం కలిగిస్తుదన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనను ఆశీర్వదించేందుకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఉత్తర నియోజకవర్గం ఇంచార్జి పసుపులేటి ఉషాకిరణ్, పార్టీ సీనియర్ నాయకులు దాడి సత్యనారాయణ, గొంప ధర్మారావు, స్వరూప్, బర్ల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ సీనియర్ నాయకురాలు ముత్యాల హరిత పుట్టినరోజు వేడుకలు!! #vvwnews
by vvwnews.com
written by vvwnews.com
2