యునైటెడ్ చర్చ్ లో మట్టలాది iవారం ఘనంగా నిర్వహణఈత చెట్టు కొమ్మలతో హోసన్నా హోసన్నా అంట ఊరేగింపులు.

by vvwnews.com

యునైటెడ్ చర్చ్ లో మట్టలాది iవారం ఘనంగా నిర్వహణ

ఈత చెట్టు కొమ్మలతో హోసన్నా హోసన్నా అంటు ఊరేగింపులు… చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు
గాజువాక, మార్చి 29:
విశాఖపట్నం జిల్లా గాజువాక, పారిశ్రామిక ప్రాంతంలోని పలు కాలనీలలో క్రైస్తవుల పవిత్ర పండుగ అయిన మట్టలాది ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పారిశ్రామిక ప్రాంతం సిందియా, మల్కాపురం, రామకృష్ణాపురం, ప్రాంతాల్లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధనలు జరిగాయి. ఇందులో భాగంగా మల్కాపురం యునైటెడ్ చర్చి ఆధ్వర్యంలో మట్టలాధి వారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా
యేసు ప్రభువు యెరూషలేములోకి ప్రవేశించిన రోజును స్మరించుకుంటూ విశ్వాసులు తాటి ఆకులు చేతబట్టి ఊరేగింపులు నిర్వహించారు. “హోషన్నా” నినాదాలతో ఆ ప్రాంతం అంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా చర్చ్ జోసెఫ్ రాజ్, ఎం దరై రాజ్ పాస్టర్స్ మాట్లాడుతూ యేసు ప్రభువు చూపించిన ప్రేమ, త్యాగం, వినయం గురించి వివరించారు. సమాజంలో శాంతి, సహనం, పరస్పర ప్రేమ పెంపొందించుకోవాలని విశ్వాసులకు సూచించారు. 2000 సంవత్సరంలో క్రిందట యేసు క్రీస్తు ప్రభువు పాపుల రక్షణార్థమే తన ప్రాణాలు అర్పించాలని గుర్తు చేశారు ప్రతి ఒక్కరు ఆయన చూపించిన శాంతి మార్గంలో నడవాలని కోరారు
మట్టలాది ఆదివారం నుంచి ప్రారంభమయ్యే పవిత్ర వారం (హోలీ వీక్) క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైనదిగా భావించబడుతుందన్నారు . ఈ వారంలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంఘ విశ్వాసులు అందరూ పాల్గొని దేవుని ప్రేమను పొందాలని ప్రతి ఒక్కరికి పంచాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సువర్ణరాజు, సెక్రటరీ జానేష్, కోశాధికారి జాషువా సభ్యులందరి పాల్గొని ఘనంగా నిర్వహించారు

Use Social Media to Spread the Word about Our News

related articles