ప్రెస్ నోట్ (అల్లిపురం)
28/03/26 (శనివారం)
*అక్షరాలను లక్షల రూపాయలకు వెల కడుతున్న కాకినాడ ఆదిత్య విద్యాసంస్థలు*
*తల్లిదండ్రులు జేబులు లూటీ చేస్తున్న పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం*
*ప్లేస్మెంట్ పేరుతో మభ్యపెట్టి విద్యార్థుల పై నిలువ దోపిడి*
*రాష్ట్ర విద్యాశాఖ చర్యలు తీసుకోలేని ఎడల ప్రత్యక్ష ఆందోళనలకు ఏఐఎస్ఎఫ్ సిద్ధం పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి*
*ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.నాగభూషణం*
అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ విశాఖపట్నం జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక అల్లిపురంలో నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ నందు శనివారం ఉదయం 10 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
పేద విద్యార్థుల కు ఉన్నత విద్య అందిస్తామని ఉద్యోగం పక్కా అని ఆశ చూపించి విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు లూటీ చేస్తున్న కాకినాడ ఆదిత్య విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్. నాగభూషణం జిల్లా కార్యదర్శి యు నాగరాజు డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగం పొందాలని డిగ్రీ జాయిన్ అయ్యే విద్యార్థుల ను లక్ష్యంగా చేసుకుని విద్యార్థుల దగ్గరి నుంచి ప్రభుత్వ యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజు కన్నా రెట్టింపు ఫీజు వసూలు చేస్తూ విద్యార్థులను నిలువెల్లా ఆదిత్య విద్యాసంస్థలు దోచుకుంటుందని తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో యూనివర్సిటీ నిర్ణయించిన అండర్ గ్రాడ్యుయేట్ ఫీజు 8000 నుంచి 14,500 వరకు ఉండగా ఆదిత్య విద్యాసంస్థలు మొదటి సంవత్సరం 41,000, రెండవ సంవత్సరం 42,000 మూడవ సంవత్సరం 42,000 వసూలు చేయడమే కాకుండా కాండేషన్ పేరుతో 75% హాజరు ఉంటే 500 రూపాయలు 65% హాజరు ఉంటే వెయ్యి రూపాయలు వసూలు చేస్తూ లక్షలాది రూపాయలు విద్యార్థుల దగ్గర్నుంచి కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అలాగే ల్యాబ్ ఫీజు, రికార్డు ఫీజు, బస్సు ఆలస్యమై లేటుగా వస్తే బయట ఉంచి మరీ ఫైన్ వసూలు చేయడం వాస్తవంగా యూనివర్సిటీ కి కాండేషన్ కట్టాలంటే చలానా తీసి కట్టాలి కాకినాడ ఆదిత్య విద్యాసంస్థలు ఎటువంటి చలానా బిల్లు ఇవ్వకుండా వసూలు చేస్తున్నారని. క్యాంపస్ డ్రైవ్ పేరుతో ప్రచార ఆర్భాటాలతో విద్యార్థులను మభ్యపెడుతూ కొంతమందికే తక్కువ ప్యాకేజీ తో ఉద్యోగాలు అందించి డిగ్రీ పూర్తయ్యాక విద్యార్థులు ఎక్కడ ఉద్యోగం పొందాలో తెలియక సతమతమవుతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ చదువుకునేందుకు నిర్ణయించిన గరిష్ట ఫీజు 18000 వేలు అయితే కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాల యాజమాన్యం 40000 పైగా వసూలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరించడం ఉన్నత విద్యాశాఖ అధికారులు దీనిపైన స్పందించకపోవడం విద్యార్థులు నిలువెల్లా మోసం చేయడమే అని తెలిపారు. తక్షణమే కాకినాడ ఆదిత్య విద్యాసంస్థలపైన సమగ్ర దర్యాప్తు నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను ఐక్యం చేసి ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధం అవుతామని దీనికి ఆదిత్య విద్యాసంస్థలు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జె. అభిషేక్, బి. కిరణ్ జిల్లా సహాయ కార్యదర్శి కె. హేమంత్ జిల్లా సమితి సభ్యురాలు కంజీర తదితరులు పాల్గొన్నారు