లఘు చిత్రాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఉమెన్స్ కమిషన్ ఛైర్పర్సన్ డా శైలజ రాయపాటి*

by vvwnews.com

*అపరాజిత- లఘు చిత్రం జగదంబ థియేటర్ లో ఆవిష్కారం*

*లఘు చిత్రాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఉమెన్స్ కమిషన్ ఛైర్పర్సన్ డా శైలజ రాయపాటి*

– మహిళా సాధికారికత ముఖ్యం
– వైఫల్యాలను అధిగమించాలి
– పాజిటివ్ గా ముందుకు సాగాలి
– రాష్ట్ర ఉమెన్స్ కమిషన్ ఛైర్పర్సన్ డా.శైలజ రాయపాటి

విశాఖపట్నం, మార్చి 25:

మహిళలు దీటైన జీవితం సాగించాలని, అవరోధాలను అధిరోహించాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ డా. శైలజ రాయపాటి పేర్కొన్నారు. బుధవారం రాత్రి నగర పోలీసు కమిషనర్ డా శంఖ బ్రత బాగ్చి శ్రీమతి సువశ్రీ బాగ్చి బెనర్జీ రచన స్క్రీన్ ప్లే దర్శకత్వంలో రూపొందిన *అపరాజిత* లఘుచిత్రం ప్రదర్శన జగదంబ థియేటర్ లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. శైలజ రాయపాటి మాట్లాడుతూ అవరోధాన్ని అధిగమించాలనే ఇతివృత్తాన్ని సువశ్రీ బాగ్చి లఘు చిత్రంలో చక్కగా ఆవిష్కరించారన్నారు. సంకల్పం బలంగా ఉండి అవకల్పాన్ని సైతం చిన్నబోయేలా చేయొచ్చని డా. శైలజ రాయపాటి చెప్పారు. కలెక్టర్ ఎం ఎన్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ మహిళా సాధికారికత ఆవశ్యకతను, ప్రభుత్వం ఆశిస్తున్న మహిళా ప్రగతి ఇతివృత్తం ఈ లఘుచిత్రం చక్కగా ఆవిష్కరించారని అన్నారు. పోలీస్ కమిషనర్ డా శంఖ బ్రత బాగ్చి మాట్లాడుతూ అపరాజిత లఘుచిత్రం విసుగు లేని విధంగా చివరివరకు ఆసక్తికరంగా దర్శకులు తీర్చిదిద్దారన్నారు. మంచికథనం ఇతివృత్తంతో తీర్చిదిద్దారన్నారు. విఎంఆర్డిఏ కమిషనర్ ఎన్ తేజ్భారత్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీసీపీ లు వి.మణికంఠ చందోలూ, డి. మేరీ ప్రశాంతి, కె లత మాధురి, పోర్ట్ డిప్యూటీ చైర్ పర్సన్ రోష్ని అపరాజిత లు మాట్లాడుతూ సువశ్రీ బాగ్చి దర్శకత్వంలో మంచి కథాంశం లఘు చిత్రంగా రూపొందడం ప్రశంసనీయం అన్నారు. సెంట్రల్ టాక్స్ గుంటూరు సీజీయస్టి ఆడిట్ కమిషనర్ ఆనంద్ కుమార్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జల్లి అజయ్ కుమార్, ఏడిసిపి డా.విబీ రాజ్ కుమారి, ఏడిపిసి కె ప్రవీణ్ కుమార్, ఏడిసిపి లు బి.శ్రీనివాసరావు,
నారాయణ రావు, ఎసిపి లక్ష్మణరావు, అప్పలరాజు, వై శ్రీనివాసరావు, నృసింహ మూర్తి,
చిట్టిబాబు, వాసుదేవ్, ఎస్వీ అప్పారావు, జెడ్ విజయకుమార్, నోవోటెల్ల్ ప్రభు కిశోర్,
పైడా విద్యాసంస్థల వ్యవస్థాపకులు పైడా పైడా కృష్ణ ప్రసాద్ తదితరులు మాట్లాడారు.

Use Social Media to Spread the Word about Our News

related articles