ప్రపంచ వాతావరణ దినోత్సవం ను జయప్రదం చేయండి
– తీరప్రాంతంలో రక్షణ వనాలు పెంచాలి
– భూమికి పూర్వపు శోభను తీసుకు వద్దాం
– విస్తారంగా సామాజిక వనాలు పెంచాలి
– జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ
ప్రపంచ వాతావరణ దినోత్సవం ను జయప్రదం చేయండి అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం అన్నమయ్య జిల్లా వీరెల్లి మండలం , రెడ్డి వారి పల్లి లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేషనల్ గ్రీన్ కోర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం జిల్లా సమన్వయ కర్త శివ లక్ష్మి అధ్యక్షతన ప్రకృతి కార్యశాల నిర్వహించడం జరిగింది. ఈ సందరర్బంగా ఆయన మాట్లాడుతూ తీరప్రాంతంలో రక్షణ వనాలు పెంచాలని కోరారు. ఇందుకుగాను ప్రధానంగా సరుగుడు, మొగలి, తీరం లో పెరిగే గడ్డి, మోర్నింగ్ గ్లోరి తదితర మైన మొక్కలు నాటి పెంచాలి అని కోరారు. భూమికి పూర్వపు శోభను తీసుకు వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విస్తారంగా సామాజిక వనాలు పెంచాలని కోరారు. ఇందుకుగాను ప్రభుత్వం తో పాటు పారిశ్రామిక వర్గాలు స్పందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కడప జిల్లా సమన్వయ కర్త శివ లక్ష్మి మాట్లాడుతూ ప్రపంచ వాతావరణ దినోత్సవం గురించి మాట్లాడుతూ నేటి వాతావరణ పరిశీలనలు (డేటా) భవిష్యత్తు తరాలను రక్షించడంలో ఎలా సహాయపడతాయో తెలియజేయడం అవసరం అన్నారు. ఉపగ్రహాలు, రాడార్ వ్యవస్థలు, వాతావరణ కేంద్రాల వంటి సాంకేతికత ద్వారా ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం అవసరం అని వివరించారు. ప్రతి సంవత్సరం మార్చి 23న వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ దీనిని నిర్వహిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముందుగా జె వి రత్నం పిచ్చుకల పరిరక్షణ కోసం గూళ్ళు విద్యార్దుల చేత తయారు చేయించడం, పశుపక్ష్యాదుల కోసం వ్యర్ధాలు తో నీళ్ళు ఏర్పాటు చేయడం కోసం పాత్రలు తయారు చేయడం మీద శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పో మధుసూదన రాజు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొని మాట్లాడారు.
ప్రపంచ వాతావరణ దినోత్సవం ను జయప్రదం చేయండి#vvwnews
9
previous post