నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో బీఆర్ నాయుడును వెంటబెట్టుకొని తిరిగి భక్తుల మనోభావాలకు.

by vvwnews.com

*22.03.2026*
*విశాఖపట్నం:*

*ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:*

* నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనలో బీఆర్ నాయుడును వెంటబెట్టుకొని తిరిగి భక్తుల మనోభావాలకు దెబ్బతీశారు.
* బీఆర్ నాయుడిపై మహిళల పట్ల అసభ్య ప్రవర్తన ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయ‌న్ను టీటీడీ చైర్మన్‌గా నియామించారు.
* అశ్లీల వీడియోలు బయటకు వచ్చినా కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాక‌రం.
* ప్రభుత్వం అండదండల వల్లే బీఆర్ నాయుడు అహంకారంగా వ్యవహరిస్తున్నారు.
* ఆయ‌న చైర్మ‌న్‌గా ఉండ‌టంతో టీటీడీ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగే అవకాశం ఉంది.
* నెయ్యి టెండర్ ధరలను పెంచడం ద్వారా దేవస్థానం నష్టం జరిగిందని విమర్శ
* కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయలేక పాలనా వైఫల్యాల నుంచి త‌ప్పించుకునేందుకు టీవీ5 సంస్థ ద్వారా అస‌త్యాలు ప్ర‌చారం చేసుకుంటున్నారు
* తిరుమలలో భక్తులకు సరైన సౌకర్యాలు లేవు, దర్శన వ్యవస్థలో లోపాలు
* తొక్కిసలాట ఘటనలు, భద్రతా లోపాలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
* ప్రముఖులకు త్వరిత దర్శనం, సాధారణ భక్తులకు ఇబ్బందులు అన్యాయం
* చంద్రబాబు కుటుంబ కార్యక్రమాల్లో బీఆర్ నాయుడి పాల్గొనడం తప్పుడు సందేశం
* వెంటనే బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వ‌రుదు క‌ళ్యాణి డిమాండ్ చేశారు.

Use Social Media to Spread the Word about Our News

related articles