శిష్టకరణ సేవారత్న’ పురస్కార ప్రదానోత్సవ వైభవంగా జరిగింది. కీర్తిశేషులు అమ్మాజమ్మ, సూర్యప్రకాశరావు

by vvwnews.com

శిష్టి కరణ పురస్కారాలు.

నగరంలోని రామ్ నగర్ వి ఎం ఆర్ డి ఏ ఫంక్షన్ హాల్‌లో ‘శిష్టకరణ సేవారత్న’ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. కీర్తిశేషులు అమ్మాజమ్మ, సూర్యప్రకాశరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్, శిష్టకరణ సేవారత్న పురస్కార కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది ఎస్.ఎన్.కె. మహంతి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు ఆర్.పి. పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై, సమాజ సేవలో విశేష కృషి చేసిన శిష్టకరణ కుల ప్రముఖులకు పురస్కారాలను అందజేశారు. ​ఈ సందర్భంగా ఆర్ పీ పట్నాయక్ మాట్లాడారు.. శిష్టకరణాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న వారిని నిర్వాహకులు గౌరవించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తల్లిదండ్రుల ఆశీస్సులే శ్రీరామరక్ష అని, వారి జ్ఞాపకార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. శిష్టకరణ సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ట్రస్ట్ అధ్యక్షురాలు అనూష పట్నాయక్, ఎస్.ఎన్.కె. మహంతి మాట్లాడుతూ.. అమ్మాజమ్మ సూర్యప్రకాశరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్, శిష్టకరణ సేవారత్న పురస్కారంతో గౌరవించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు ఎల్.వి.ఎస్. బెనర్జీ,హరినాథ్, అమృత పట్నాయక్, శివప్రసాదరావు, శశి పట్నాయక్ పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles