అడవులు పరిరక్షణ మానవాళి బాధ్యత
– చిట్టడవులతో కర్బన వాయువులను తగ్గించుదాం
– నగరవనాల్లొ పక్షులు గూళ్ళు పెట్టే చెట్లు పెంచాలి
– భూమికి పూర్వపు శోభను తీసుకు వేద్దాం
– ఆకుల చలపతిరావు, రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ నర్సరీల అసోషియేషన్ ఆకుల చలపతిరావు
అడవులు పరిరక్షణ మానవాళి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ నర్సరీల అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆకుల చలపతిరావు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పెద్ద గాడి గ్రామంలోని సంకల్ప కళా గ్రామం లో ప్రపంచ అడవులు పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని సంకల్ప కళా గ్రామం, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ లు సంయుక్తంగా నిర్వహించాయి. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం ఇతివృత్తం “అడవులూ, ఆర్థిక వ్యవస్థలు” అన్నారు. అడవులు ఆర్థిక అభివృద్ధి, జీవనోపాధి, ఉపాధి అవకాశాల్లో కీలక పాత్ర పోషిస్తాయని తెలియజేశారు. అలాగే పర్యావరణ సమతుల్యతతో పాటు ఆర్థిక వృద్ధి కోసం సుస్థిర అటవీ నిర్వహణ అవసరాన్ని ప్రోత్సహిస్తుందని వివరించారు. చిట్టడవులతో కర్బన వాయువులను తగ్గించుదాం అన్నారు. నగరవనాల్లొ పక్షులు గూళ్ళు పెట్టే చెట్లు పెంచాలని , ఔషధ గుణాలు కలిగిన చెట్లు, కాలుష్యాన్ని నిర్మూలించే చెట్లు పెంచాలని కోరారు. భూమికి పూర్వపు శోభను తీసుకు వచ్చెందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మేంగొ మేన్ అప్పాజీ మాట్లాడుతూ మన వృక్షాలను మనమే కాపాడుకోవాలి అని కోరారు. అడవులు మన ఆరోగ్యానికి,ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయి అన్నారు. అడవులు గ్రామీణ జీవనోపాధులకు ప్రధాన మైన మద్దతు ఇస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా 1.6 బిలియన్ మంది ప్రజలు అడవులపై ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు.
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ మాట్లాడుతూ అడవులను ఆర్థిక లాభం కోసం మాత్రమే కాకుండా జీవవైవిధ్య పరిరక్షణతో ప్రధాన మైనవి గా గుర్తించాలన్నారు. మనం భూగోళం సమస్త జీవరాశి ఆవాశం అన్నారు. అందులో మనిషి ఒక భాగం మాత్రమే అనె ముఖ్యాంశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తులసి నేచురల్స్ ప్రతినిధి టి సత్యన్నారాయణ , సంకల్ప కళా గ్రామం ప్రతినిధులు పార్వతి, జమిల్యా, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, సమన్వయకర్త జె రాజేశ్వరి తదితరులు పాల్గొని మాట్లాడారు
అడవులు పరిరక్షణ మానవాళి బాధ్యత #vvwnews #astrology
13